ఓ శునకం ఏకంగా చిరుతను ఎదురించింది. తన యజమాని కుటుంబానికి రక్షణగా నిలిచింది. ఆ కుక్క ధైర్యానికి ఆ వన్య మృగం కూడా వెనక్కి తగ్గింది. వచ్చిన దారినే వెనక్కి వెళ్లిపోయింది. 

ఓ కుక్క చిరుత పులిని భయపెట్టింది. తన యజమాని ఇంటికి రక్షణగా నిలిచింది. వన్య మృగంతో పోరాడింది. దీంతో ఆ పులి తోక ముడిచింది. వచ్చిన దారినే పరుగు పెట్టింది. ఈ దృష్యాలన్నీ అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఇప్పుడవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మధ్యప్రదేశ్ లోనూ కర్ణాటక ఫార్ములా.. ఫోన్ పే లోగోపై చౌహాన్ ఫొటో తో కాంగ్రెస్ ప్రచారం..మండిపడ్డ పేమెంట్స్ కంపెనీ

ఈ ఘటన మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ లో చోటు చేసుకుంది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం. ఓ కుక్క తన యజమాని ఇంటికి కాపాలా కాస్తోంది. ఆ ఇంటికి రాత్రి సమయంలో ఓ చిరుతపులి వచ్చింది. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించింది. కానీ ఆ ఇంటి ప్రవేశద్వారం వద్ద ఓ కుక్క కాపాలాగా ఉందన్న విషయం అది గ్రహించలేకపోయింది.

Scroll to load tweet…

ఆ చిరుత పులి దగ్గరకు రాగానే కుక్క మొరగడం ప్రారంభించింది. ఏకంగా చిరుత పులిపైనే తిరగబడింది. లోపలకు వెళ్లకుండా అడ్డుపడింది. కుక్క పోరాటానికి పులి వెనక్కి తగ్గింది. తోక ముడిచి వచ్చిన దారిన వెళ్లిపోయింది.

ఆర్కెస్ట్రా గ్రూపులో చేరిన మహిళపై అత్యాచారం, పెళ్లి చేసుకోవాలంటే ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి, బలవంతంగా అబార్షన్

కాగా.. ఈ ఏడాది జనవరిలో కర్ణాటకలోని రాంనగర్ లో చిరుత పెంపుడు కుక్కపై దాడి చేసింది. ఆ కుక్కను తన నోటితో పట్టుకొని తీసుకెళ్లిపోయింది. ఈ ఘటన మొత్తం ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.