తనతో కలిసి పని చేసే మహిళపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె గర్భం దాల్చింది. బలవంతంగా అబార్షన్ చేయించాడు. అనంతరం తనను పెళ్లి చేసుకోవాలంటే ఇస్లాం మతంలోకి మారాలని ఒత్తిడి తెచ్చాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన యూపీలో వెలుగులోకి వచ్చింది. 

ఆ మహిళకు కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. పలు కారణాల వల్ల భర్తతో విడిగా ఉంటోంది. ఆమెకు మూడేళ్ల కుతురు ఉంది. ఆ చిన్నారి పోషణ కోసం ఆమె ఓ అర్కెస్ట్రా గ్రూపులో చేరారు. అక్కడ ఓ వ్యక్తితో ఆమెతో స్నేహం చేశాడు. ఆ సాన్నిహిత్యాన్ని అడ్డుపెట్టుకొని ఆ వ్యక్తి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. దీంతో ఆమె గర్భం దాల్చింది. దీంతో బలవంతంగా అబార్షన్ చేయించాడు. పెళ్లి చేసుకోవాలంటే ఇస్లాం మతంలోకి మారాలని ఒత్తిడి చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. 

భీమ్ ఆర్మీ చీఫ్ ఆజాద్ పై బుల్లెట్ల దాడి.. హాస్పిటల్ నుంచే మద్దతుదారులకు సందేశం.. ఏం చెప్పారంటే ?

బాధితురాలి ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బాధితురాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. యూపీలోని గోరఖ్ పూర్ కు చెందిన 32 ఏళ్ల మహిళకు కొన్ని సంవత్సరాల కిందట వివాహం జరిగింది. ఆ దంపతులకు ఓ కుమార్తె జన్మించింది. ఆ పాపకు ప్రస్తుతం మూడు సంత్సరాలు. భర్తతో విబేధాల కారణంగా కొంత కాలం నుంచి ఆమె విడిగా ఉంటోంది. కూతురు పోషణ కోసం ఆమె ఓ ఆర్కెస్ట్రా గ్రూపులో చేరారు.

జగన్నాథ రథయాత్రలో విషాదం.. కరెంట్ షాక్ తో ఏడుగురి మృతి.. విచారం వ్యక్తం చేసిన ప్రధాని.. నష్టపరిహారం ప్రకటన

ఆ గ్రూపులో పని చేస్తున్న క్రమంలో ఆమెకు అక్కడ ఖుర్షీద్ హష్మీని అనే వ్యక్తి పరిచయం అయ్యింది. కొంత కాలం తరువాత వారిద్ధరూ స్నేహితులు అయ్యారు. ఈ స్నేహాన్ని అడ్డుపెట్టుకొని ఆమెపై ఖుర్షీద్ అత్యాచారానికి పాల్పడ్డాడు. తరువాత కూడా ఆమెను శారీరకంగా వేధించడం ప్రారంభించాడు. కొంత కాలం తరువాత బాధితురాలు గర్భం దాల్చింది. దీంతో ఆమెను బలవంతంగా అబార్షన్ చేయించాడు.

ఢిల్లీ మెట్రోలో భారీ ఫైట్.. దారుణంగా కొట్టుకున్న ఇద్దరు వ్యక్తులు.. వైరల్ అవుతున్న వీడియో

తనను పెళ్లి చేసుకోవాలంటే ఇస్లాం మతంలోకి మారాలని ఖుర్షీద్ ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఇంతలో అతడు వేరే మహిళలను వివాహం చేసుకున్నాడు. తరువాత బాధితురాలని కొట్టి ఇంటి నుంచి గెంటేశాడు. దీంతో మహిళ పోలీసులను ఆశ్రయించింది. తనపై జరిగిన లైంగిక దాడిపై ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడిని అరెస్టు చేశామని రాజ్‌ఘాట్ ఎస్ హెచ్ ఓ తెలిపారు.