Asianet News TeluguAsianet News Telugu

మణిపూర్ లో బీఎస్ఎఫ్ జవాన్ ను కాల్చి చంపిన కుకీ తిరుగుబాటుదారులు.. మరో ఇద్దరు సైనికులకు గాయాలు

మణిపూర్ లో ఉద్రిక్తతలు చల్లారడం లేదు. రెండు వర్గాల మధ్య మొదలైన ఘర్షణ భారీ స్థాయిలో ప్రాణనష్టానికి కారణమవుతోంది. తాజాగా ఈ ఘర్షణలో ఓ బీఎస్ఎఫ్ జవాన్ హతమయ్యాడు. కుకీ తిరుగుబాటుదారులు కాల్పులు జరపడంతో ఆయనకు బుల్లెట్ గాయాలు అయ్యాయి. హాస్పిటల్ కు తీసుకువెళ్లినప్పటికీ.. జవాన్ అప్పటికే మరణించాడని డాక్టర్లు తెలిపారు.

Kuki rebels shot and killed a BSF jawan in Manipur.. Two other soldiers were injured..ISR
Author
First Published Jun 6, 2023, 2:26 PM IST

మణిపూర్ లో చెలరేగిన హింస ఇంకా చల్లారడం లేదు. సెరో ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున అనుమానిత కుకీ తిరుగుబాటుదారులు సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) జవాన్ కాల్చి చంపారు. మరో ఇద్దరు అస్సాం రైఫిల్స్ కు చెందిన సైనికులకు గాయాలు అయ్యాయి. కక్చింగ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

కర్ణాటకలో త్వరలో ఎమర్జెన్సీ - మాజీ సీఎం బీఎస్ బొమ్మై సంచలన వ్యాఖ్యలు

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కక్చింగ్ జిల్లా సుగ్నులోని సెరో ప్రాంతంలోని పాఠశాలలో కుకి తిరుగుబాటుదారులకు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. సెరూ ప్రాక్టికల్ హైస్కూల్ వద్ద మోహరించిన బీఎస్ఎఫ్ దళాలను లక్ష్యంగా చేసుకుని కుకి దుండగులు తెల్లవారుజామున 4.15 గంటలకు విచక్షణారహితంగా, భారీ కాల్పులకు పాల్పడ్డారు. దీంతో సైనికులు కూడా కాల్పులు జరపాల్సి వచ్చింది.

ఫుడ్ బిల్లు షేరింగ్ విషయంలో గొడవ.. 18 ఏళ్ల యువకుడిని చంపిన నలుగురు స్నేహితులు.. ఎక్కడంటే ?

ఈ ఎదురుకాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాన్ రంజిత్ యాదవ్ కు బుల్లెట్ గాయాలు అయ్యాయి. ఆయనను వెంటనే కక్చింగ్ లోని జీవన్ హాస్పిటల్ కు తరలించారు. కానీ ఆయన అప్పటికే మరణించాడని వైద్యాధికారులు తెలిపారు. కాగా.. దీనిపై ఇండియన్ ఆర్మీకి చెందిన స్పియర్ కార్ప్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘జనరల్ ఏరియా సెరోలో ఒక బీఎస్ఎఫ్ జవానుకు ప్రాణాంతక గాయాలు కాగా, ఇద్దరు అస్సాం రైఫిల్స్ సిబ్బందికి బుల్లెట్ గాయాలయ్యాయి.’’ అని పేర్కొంది. గాయపడిన ఇద్దరు అస్సాం రైఫిల్స్ సిబ్బందిని మంత్రిపుఖ్రికి తరలించామని, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని  ట్వీట్ చేసింది.

‘‘మణిపూర్ సుగ్ను/సెరో ప్రాంతాల్లో అస్సాం రైఫిల్స్, బీఎస్ఎఫ్, పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. జూన్ 05/06 రాత్రి అంతా భద్రతా దళాలు, తిరుగుబాటుదారుల సమూహం మధ్య అడపాదడపా కాల్పులు జరిగాయి. ఈ కాల్పులను భద్రతా దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి.’’ అని  అధికారులు తెలిపారు. 

పదే పదే చాక్లెట్లు, బొమ్మలు, బట్టలు అడుగుతోందని కూతురిని చంపిన తండ్రి.. ఇండోర్ లో ఘటన

కాగా.. శాంతిని పునరుద్ధరించడానికి మ‌ణిపూర్ లో సుమారు 10,000 మంది ఆర్మీ, అస్సాం రైఫిల్స్ సిబ్బందిని రాష్ట్రంలో మోహరించారు. గత వారం తన పర్యటన సందర్భంగా హోం మంత్రి అమిత్ షా రాష్ట్రంలో ఘ‌ర్ష‌ణ‌ల‌కు కార‌ణ‌మైన మైతీలు, కుకీలు శాంతిని పాటించాలనీ, రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు తీసుకురావడానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

గుజరాత్ లో దారుణం.. క్రికెట్ బాల్ పట్టుకున్నాడని గొడవ.. దళిత యువకుడి బొటన వేలు నరికిన దుండగులు..

అసలేం జరిగిందంటే ? 
షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) హోదా కోసం గిరిజనేతర మీటీలు డిమాండ్ చేయడాన్ని నిరసిస్తూ ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్ (ఏటీఎస్ యూఎం) ‘ట్రైబల్ సాలిడారిటీ మార్చ్’కు పిలుపునిచ్చింది. చురాచంద్పూర్ జిల్లాలోని తోర్బంగ్ ప్రాంతంలో ఏప్రిల్ నెల చివరి వారంలో  నిర్వహించిన ఈ కార్యక్రమానికి వేలాది మంది హాజరయ్యారు. ఈ మార్చ్ లో వేలాది మంది గిరిజనులు కవాతులో పాల్గొన్నారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ, మెయిటీ కమ్యూనిటీకి ఎస్టీ హోదాను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ఈ పరిణామం టోర్బంగ్ ప్రాంతంలో గిరిజనులు, గిరిజనేతరుల మధ్య హింసకు దారితీసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios