Asianet News TeluguAsianet News Telugu

ఫుడ్ బిల్లు షేరింగ్ విషయంలో గొడవ.. 18 ఏళ్ల యువకుడిని చంపిన నలుగురు స్నేహితులు.. ఎక్కడంటే ?

ఫుడ్ బిల్ కట్టే విషయంలో మొదలైన గొడవ ఓ యువకుడి ప్రాణం తీసింది. నలుగురు స్నేహితులు కలిసి ఆ యువకుడిని దారుణంగా హతమార్చారు. ఇందులో ఇద్దరు మైనర్లు ఉన్నారు. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబాయిలో జరిగింది. 

Quarrel over food bill sharing... Four friends who killed an 18-year-old boy... Where are they?..ISR
Author
First Published Jun 6, 2023, 12:27 PM IST

రూ.10 వేల ఫుడ్ బిల్లు షేరింగ్ విషయంలో జరిగిన గొడవలో 18 ఏళ్ల బాలుడిని నలుగురు స్నేహితులు హత్య చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబైలో చోటు చేసుకుంది. సబర్బన్ గోవండిలో గత వారం ఈ దారుణం జరిగినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. అయితే నలుగురు నిందితుల్లో మైనర్లుగా ఉన్న ఇద్దరు బాలురు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన 19, 22 ఏళ్ల వయసున్న మరో ఇద్దరిని గుజరాత్ లో అరెస్టు చేశారు.

పదే పదే చాక్లెట్లు, బొమ్మలు, బట్టలు అడుగుతోందని కూతురిని చంపిన తండ్రి.. ఇండోర్ లో ఘటన

శివాజీ నగర్ పోలీస్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. మే 31న బాధితుడు ఓ దాబాలో బర్త్ డే పార్టీ చేసుకున్నాడు. ఫుడ్ బిల్లు రూ.10 వేలు వచ్చింది. దీంతో బిల్లును పంచుకునే విషయంలో బాధితుడు, అతడి స్నేహితుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అయితే ఆ తర్వాత బాధితుడు తన జేబులో నుంచే బిల్లు చెల్లించాడు.

గుజరాత్ లో దారుణం.. క్రికెట్ బాల్ పట్టుకున్నాడని గొడవ.. దళిత యువకుడి బొటన వేలు నరికిన దుండగులు..

అనంతరం నలుగురు నిందితులు మరో బర్త్ డే పార్టీ ఏర్పాటు చేసి బాధితురాడిని ఆహ్వానించారు. కేక్ తినిపించిన తర్వాత పదునైన ఆయుధాలతో పలుమార్లు హతమార్చారు. ఈ ఘటన తర్వాత ఇద్దరు నిందితులు ఉత్తరప్రదేశ్ లోని తమ స్వస్థలం గోండాకు పారిపోయేందుకు ప్రయత్నించగా.. జూన్ 2వ తేదీన అహ్మదాబాద్ లో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. 17 ఏళ్ల ఇద్దరు మైనర్ నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయారు దీంతో వారిని కరెక్షన్ హోమ్ కు తరలించారు. మేజర్లు అయిన ఇద్దరు నిందితులపై ఐపీసీ సెక్షన్ 302 (హత్య) కింద అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios