Asianet News TeluguAsianet News Telugu

గుజరాత్ లో దారుణం.. క్రికెట్ బాల్ పట్టుకున్నాడని గొడవ.. దళిత యువకుడి బొటన వేలు నరికిన దుండగులు..

పలువురు యువకులు క్రికెట్ ఆడుతుండగా ఓ దళిత బాలుడు బాల్ ను పట్టుకున్నాడు. దీంతో గొడవ జరగడంతో బాలుడి మేనమామ వచ్చి పరిస్థితి చక్కదిద్దాడు. ఆ కోపంతో ఆ యువకులు అతడి మేమమామపై దాడి చేసేందుకు ఆయుధాలు పట్టుకొని వచ్చారు. అతడి సోదరుడు అడ్డురావడంతో బొటనవేలును నరికారు. 

Atrocious in Gujarat.. Quarrel over holding a cricket ball.. Thugs cut off Dalit youth's thumb..ISR
Author
First Published Jun 6, 2023, 10:56 AM IST

గుజరాత్ లో దారుణం జరిగింది. ఓ దళిత బాలుడు క్రికెట్ బాల్ పట్టుకున్నాడనే కోపంతో గ్రామస్తులు అతడిపై దాడి చేసేందుకు వచ్చారు. దీనిని గమనించిన బాలుడి మేనమామ అక్కడికి చేరుకున్నాడు. వారిని ఎదిరించి బాలుడికి ఏమీ జరగకుండా చూసుకున్నాడు. అయితే ఆ రోజు సాయంత్రం కొందరు దుండగులు ఆ యువకుడి దగ్గరికి వెళ్లి ఆయుధాలతో దాడి చేశారు. ఈ క్రమంలో ఆ యువకుడి సోదరుడి అడ్డుగా రావడంతో అతడి బొటన వేలు నరికారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది.

ఒడిశా ట్రైన్ యాక్సిడెంట్.. ప్రమాదంపై 3 నెలల ముందే హెచ్చరించిన రైల్వే అధికారి..

‘ఇండియా టుడే’ కథనం ప్రకారం.. గుజరాత్ లోని పటాన్ జిల్లాలోని కకోషి గ్రామంలోని స్కూల్ ప్లే గ్రౌండ్ లో పలువురు యువకులు ఆదివారం  క్రికెట్ అడారు. దీనిని చూసేందుకు కొందరు పిల్లలు ఆ స్కూల్ కు వెళ్లారు. క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న క్రమంలో ఓ దళిత సామాజిక వర్గానికి చెందిన బాలుడు ఆ బాల్ ను పట్టుకున్నాడు. దీంతో ఆగ్రహించిన పలువురు యువకులు బాలుడి దగ్గరికి వచ్చాడు. ఆ బాలుడిని అవమానించాడు. భయపెట్టాలనే ఉద్దేశంతోనే బాలుడిపై కుల దూషణలకు పాల్పడ్డాడు.

రైల్వేలో తిరిగి విధుల్లోకి చేరిన రెజ్లర్లు.. ఆందోళనపై వెనక్కి తగ్గేది లేదంటూ వ్యాఖ్యలు

ఈ విషయం బాలుడి మేనమామ ధీరజ్ పర్మార్ కు తెలిసింది. వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఆ యువకులతో వాదించాడు. బాలుడిని వారి బారి నుంచి రక్షించాడు. దీంతో అప్పటికి సమస్య పరిష్కారమైంది. అయితే అదే రోజు సాయంత్ర ఏడుగురు వ్యక్తుల బృందం పదునైన ఆయుధాలు తీసుకొని ధీరజ్ ఇంటికి వచ్చారు. ఇంటి వద్ద ధీరజ్ సోదరుడు కీర్తి కూడా ఉన్నాడు. అయితే ఈ రెండు గ్రూపుల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో కీర్తి బొటన వేలును ఆ దుండగులు నరికారు అని వార్తా సంస్థ ‘పీటీఐ’ తెలిపింది.

దేశ ప్రతిష్ట రాహుల్ గాంధీకి అర్థం కావడం లేదు - బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఐపీసీ సెక్షన్ 326 (ప్రమాదకరమైన ఆయుధాలతో తీవ్రంగా గాయపరచడం), 506 (క్రిమినల్ బెదిరింపు), ఇతర సంబంధిత నిబంధనలు, ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.

Follow Us:
Download App:
  • android
  • ios