Asianet News TeluguAsianet News Telugu

కేరళ తొలి ట్రాన్స్ జెండర్ బాడీ బిల్డర్ ప్రవీణ్ నాథ్ ఆత్మహత్య.. మనస్థాపంతో భార్య కూడా ఆత్మహత్యాయత్నం..ఎందుకంటే

కేరళకు చెందిన తొలి ట్రాన్స్ జెండర్ బాడీబిల్డర్ ప్రవీణ్ నాథ్ ఆత్మహత్యకు చేసుకున్నారు. ఈ విషయంలో మనస్థాపం చెందిన ఆయన భార్య కూడా ఆత్మహత్య యత్నానికి ఒడిగట్టారు. వీరిద్దరూ ఈ ఏడాది ప్రేమికుల రోజున పెళ్లి చేసుకున్నారు. 

Keralas first transgender body builder Praveen Nath commits suicide. Because the wife also tried to commit suicide with her mind..ISR
Author
First Published May 5, 2023, 12:11 PM IST

కేరళలో తొలి ట్రాన్స్ జెండర్ బాడీబిల్డర్ ప్రవీణ్ నాథ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఆయనను త్రిస్సూర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడే చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణించాడు. ప్రవీణ్ నాథ్, అతడి ట్రాన్స్జెండర్ భాగస్వామి రిషానా ఐషును ఈ ఏడాది వాలెంటైన్స్ డే నాడు వివాహం చేసుకున్నారు. అయితే వీరిద్దరూ వైవాహిక జీవితానికి ముగింపు పలకబోతున్నారని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. 

పాక్‌కు రహస్య సమాచారం అందించిన డీఆర్‌డీవో శాస్త్రవేత్త.. అరెస్టు చేసిన మహారాష్ట్ర ఏటీఎస్

కానీ ఈ పుకార్లను కమల్ నాథ్ తన ఫేస్ బుక్ పోస్ట్ లో ఖండించారు. వారిద్దరూ విడిపోతారనే పుకార్ల నేపథ్యంలోనే ఆయన సైబర్ దాడికి గురైనట్లు సమాచారం. దీంతో నాథ్ మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే నాథ్ ఇలాంటి అఘాయిత్యానికి ఒడిగట్టడంతో మనస్తాపానికి గురైన అతడి భాగస్వామి ఐషూ కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను మెడికల్ కాలేజీ హాస్పిటల్ లో తరలించారు. 

సెర్బియాలో మరో సారి కాల్పుల కలకలం.. 8 మంది మృతి, 11 మందికి గాయాలు

కాగా.. కమల్ నాథ్ చావుకు సోషల్ మీడియానే కారణమని ఆరోపిస్తూ, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ ముఖ్యమంత్రి, డీజీపీకి ఫిర్యాదు చేసింది. 2021లో ట్రాన్స్ జెండర్ విభాగంలో ప్రవీణ్ నాథ్ మిస్టర్ కేరళ పోటీలో విజయం సాధించారు. 2022లో జరిగిన అంతర్జాతీయ బాడీబిల్డింగ్ ఛాంపియన్షిప్ లో ఫైనలిస్ట్ గా నిలిచారు. మరుసటి ఏడాది ఆయన లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నారు.

ఆబ్కారీ మంత్రికి అసలు నీరా అంటే ఏంటో తెలుసా - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ఎర్నాకుళంలోని మహారాజా కాలేజీలో ప్రవీణ్, మరో ఇద్దరు ట్రాన్స్ జెండర్ విద్యార్థులు 2018లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరారు. విశ్వవిద్యాలయాలు, అనుబంధ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలల్లోని అన్ని కోర్సుల్లో ట్రాన్స్ జెండర్ దరఖాస్తుదారులకు అదనపు సీట్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ ద్వారా ఇది సాధ్యమైంది. అయితే 2020లో ప్రవీణ్ బాడీబిల్డింగ్ ప్రారంభించాడు. ఏడాది తర్వాత ప్రవీణ్ తీవ్రంగా శ్రమించి మిస్టర్ త్రిస్సూర్ టైటిల్ గెలిచాడు. త్రిస్సూర్ లో కార్యాలయాలున్న ఎల్జీబీటీక్యూఐఏ+ కమ్యూనిటీకి చెందిన సహాయత్రికలో చేరి అడ్వకసీ కోఆర్డినేటర్ గా నియమితులయ్యారు.

జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 )  కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.

Follow Us:
Download App:
  • android
  • ios