Asianet News TeluguAsianet News Telugu

పాక్‌కు రహస్య సమాచారం అందించిన డీఆర్‌డీవో శాస్త్రవేత్త.. అరెస్టు చేసిన మహారాష్ట్ర ఏటీఎస్

పాక్ కు రహస్య సమాచారం అందించారనే ఆరోపణలపై డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ)లో పనిచేస్తున్న ఓ శాస్త్రవేత్తను ఏటీఎస్ అరెస్టు చేసింది. ఆయన తన పదవిని దుర్వినియోగం చేశారని ఏటీఎస్ పేర్కొంది. 

DRDO scientist who gave confidential information to Pakistan.. Maharashtra ATS arrested..ISR
Author
First Published May 5, 2023, 11:22 AM IST

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ)లో పనిచేస్తున్న శాస్త్రవేత్తను మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అరెస్టు చేసింది. పాకిస్థానీ ఏజెంట్‌కు రహస్య సమాచారం అందించాడనే ఆరోపణలపై ఈ అరెస్టు జరిగిందని ఏటీఎస్ అధికారులు గురువారం వెల్లడించారు. వాట్సాప్, వీడియో కాల్‌ల ద్వారా ఆ శాస్త్రవేత్త పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్ ఏజెంట్‌తో టచ్‌లో ఉన్నారని పేర్కొన్నారు.

తన చితి తానే పేర్చుకొని వృద్ధుడి ఆత్మహత్య.. వంతుల వారీగా కుమారుల దగ్గర ఉండటం ఇష్టం లేకే దారుణం..

ఇది హనీట్రాప్ కేసు అని చెప్పారు. ప్రీమియర్ డిఫెన్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఆయన ఉన్నత పదవిలో ఉన్నారని చెప్పారు. అతడిని బుధవారం అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. ‘‘శత్రు దేశం స్వాధీనం చేసుకున్న అధికారుల రహస్యాలు దేశ భద్రతకు ముప్పు కలిగిస్తాయి. ఈ విషయం తెలిసినప్పటికీ, శాస్త్రవేత్త తన అధికారాన్ని దుర్వినియోగం చేశారు. శత్రు దేశానికి వివరాలను అందించాడు’’ అని ఏటీఎస్ ఓ ప్రకటనలో తెలిపింది.

ఆబ్కారీ మంత్రికి అసలు నీరా అంటే ఏంటో తెలుసా - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

అధికారిక రహస్యాల చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద నేరం ముంబైలోని ఏటీఎస్ కాలాచౌకి యూనిట్‌లో ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. దీనిపై తదుపరి విచారణ కొనసాగుతోంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios