Asianet News TeluguAsianet News Telugu

ఆబ్కారీ మంత్రికి అసలు నీరా అంటే ఏంటో తెలుసా ?- ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

తెలంగాణ ఆబ్కారీ మంత్రికి అసలు నీరా అంటే అవగాహన ఉందా అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. సూర్యరశ్మి పడక ముందు ఉన్న దానిని మాత్రమే నీరా అంటారని చెప్పారు. 

Does the Excise Minister know what Neera really means - MLC Jeevan Reddy..ISR
Author
First Published May 5, 2023, 8:39 AM IST

తెలంగాణ రాష్ట్ర ఆబ్కారీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ కు అసలు నీరా అంటే ఏంటో తెలుసా అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులు నీరా కేఫ్‌లు అంటూ కొత్తగా ఏదో సాధించినట్టు ప్రచారం చేసుకుంటున్నారని ఆయన విమర్శించారు. గురువారం ఆయన జగిత్యాల జిల్లాలోని సారంగపూర్ లో మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పై విమర్శలు చేశారు.

కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్ లో సిరిసిల్లా వాసి మృతి.. బోయినపల్లి మండలం మల్కాపూర్ లో మిన్నంటిన రోదనలు

నీరా అంటే ఏంటో ఆబ్కారీ మంత్రికి అవగాహన లేదేమో అని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. సూర్యరశ్మి పడకముందే నీరా తాగాలని ఆయన చెప్పారు. సూర్య కిరణాలు తాకిన తరువా అది కల్లుగా మారుతుందని అన్నారు. గ్రామాల్లో అనధికారంగా మద్యం బెల్టు షాపులు కొనసాగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీని వల్ల గీత కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిని నిలువరించేందుకు చర్యలు తీసుకోకుండా, మిగితా విషయాలు చెబుతూ మభ్య పెట్టడం సరైంది కాదని చెప్పారు.

తన చితి తానే పేర్చుకొని వృద్ధుడి ఆత్మహత్య.. వంతుల వారీగా కుమారుల దగ్గర ఉండటం ఇష్టం లేకే దారుణం..

గీత కార్మికులతో పాటు అన్ని వర్గాల కార్మికులు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కల్పించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, వెంటనే బీపీఎల్ కుటుంబాలకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ను అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios