సారాంశం

సెర్బియాలో ఓ దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో 8 మంది మరణించారు. మరో 11 మందికి గాయాలు అయ్యాయి. దుండగుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

సెర్బియాలో మరో కాల్పుల ఘటన వెలుగు చూసింది. రాజధాని బెల్‌గ్రేడ్‌కు దక్షిణంగా 60 కిలోమీటర్ల (37 మైళ్ళు) దూరంలో ఉన్న సెర్బియా పట్టణానికి సమీపంలో గురువారం అర్థరాత్రి జరిగిన కాల్పుల్లో ఎనిమిది మంది మరణించారు. 13 మంది గాయపడ్డారు. మ్లాడెనోవాక్ సమీపంలో ఆటోమేటిక్ ఆయుధంతో వచ్చిన దుండగుడు కదులుతున్న వాహనం నుంచి కాల్పులు జరిపి పారిపోయాడని ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆర్టీఎస్ టెలివిజన్ తెలిపింది. దుండగుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

తండ్రి తాగొచ్చి తల్లిని రోజూ కొడుతున్నాడని ఎస్సైకి ఫిర్యాదు చేసిన తొమ్మిదేళ్ల బాలుడు.. ఎక్కడంటే ?

దుండగుడిని పట్టుకునేందుకు ఆ ప్రాంతంలో హెలికాప్టర్లను రంగంలోకి దించారు. అలాగే ఘటనా స్థలంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మాలో ఒరాస్జే, దుబోనా గ్రామాలకు వెళ్లే రహదారిని పోలీసులు దిగ్బంధించారు. అయితే కాల్పుల్లో గాయపడిన, మరణించిన తరఫు వారి బంధువులు బెల్గ్రేడ్లోని అత్యవసర వైద్య కేంద్రం దగ్గర గుమిగూడారు. ఈ ఘటనపై సమాచారం అందడంతో హెల్త్ మినిస్టర్ డానికా గ్రుజిసిక్ ఈ కేంద్రాన్ని సందర్శించారు. 

ఈ కాల్పులను ఇంటీరియర్ మినిస్టర్ బ్రాటిస్లావ్ గాసిక్ ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు.. కాగా.. చాలా కాలంగా సెర్బియాలో కాల్పుల ఘటనలు ఆగడం లేదు. కొన్ిన రోజుల క్రితం సెర్బియా రాజధాని బెల్‌గ్రేడ్‌లో ఇలాంటి ఘటన ఒకటి వెలుగు చూసింది. ఓ 14 ఏళ్ల విద్యార్థి పాఠశాలలో విద్యార్థులు, సెక్యూరిటీ గార్డులపై కాల్పులు జరిపాడు. ఇందులో 9 మంది మరణించారు. మృతుల్లో 8 మంది చిన్నారులు ఉన్నారు. ఈ కాల్పులు జరిపిన 7వ తరగతి విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో కూడా ఎమ్మెల్యేనోవాక్‌లో ఒక గ్రామస్తుడు 13 మంది బంధువులు, పొరుగువారిని కాల్చి చంపాడు.