Asianet News TeluguAsianet News Telugu

షహాబాద్ ఘటనపై కేజ్రీవాల్ దిగ్భ్రాంతి.. బాధితురాలి కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారమిస్తామని ప్రకటన

ఢిల్లీలో జరిగిన మైనర్ హత్యపై ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ విచారం వ్యక్తం చేశారు. బాధితురాలి కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారం ఇస్తామని తెలిపారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. 

Kejriwal shock over the Shahabad incident. Announcement that the victim's family will be compensated Rs 10 lakh..ISR
Author
First Published May 30, 2023, 2:58 PM IST

దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఢిల్లీలోని షాహాబాద్ హత్య ఘటనపై ఆప్ చీఫ్, సీఎం కేజ్రీవాల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితురాలి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇస్తామని ప్రకటించారు. ఈ ఘటన బాధాకరమని, నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. ఢిల్లీలో శాంతి భద్రతలపై ఆందోళన చెందుతున్నానని అన్నారు.

‘‘ఇది చాలా బాధాకరమైన సంఘటన. ఢిల్లీ ప్రభుత్వం బాలిక కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారం ఇస్తుంది. నిందితుడికి కఠిన శిక్ష పడేలా తమ ప్రభుత్వం చూస్తుంది. ఢిల్లీలో మొత్తం శాంతిభద్రతల పరిస్థితిపై ఆందోళన చెందుతున్నాం. మంత్రి అతిషి కుటుంబాన్ని పరామర్శిస్తారు’’ అని ఆయన ట్వీట్ చేశారు. 

కనీసం కొంత మంది క్రీడాకారులకైనా గౌరవం దక్కుతోంది - సీఎస్ కే విజయంపై రెజ్లర్ సాక్షి మాలిక్ స్పందన

కొంత సమయం తరువాత చేసిన మరో ట్వీట్ లో ఆయన ఢిల్లీలో శాంతి భద్రతలను పరిరక్షించాని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కోరారు. ‘‘మన ఢిల్లీలో ఏం జరుగుతోంది? శాంతిభద్రతలు పూర్తిగా కుదేలయ్యాయి. చుట్టూ జంగిల్ రాజ్యం ఉంది. ఎల్జీ సాహెబ్, ఏదో ఒకటి చేయండి...’’ అని పేర్కొన్నారు. కాగా.. ఢిల్లీ మంత్రి అతిషి చేసిన ఓ ట్వీట్ లో.. తాను ఈ రోజు 3 గంటల వరకు బాధిత కుటుంబాన్ని కలువబోతున్నానని 

అసలేం జరిగింది.. 
వాయవ్య ఢిల్లీలోని షహాబాద్ డెయిరీ ప్రాంతంలో రద్దీగా ఉండే బైలాన్ లో ఓ యువకుడు 16 ఏళ్ల బాలికను దారుణంగా పొడిచి చంపాడు. ఈ భయంకరమైన హత్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో అనేక వర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది. ఈ ఘటనకు పాల్పడిన యువకుడిని సాహిల్ గా పోలీసులు గుర్తించారు.

తప్పిన పెను ప్రమాదం.. బెళగావిలో ట్రైనింగ్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. పైలట్లకు గాయాలు

సోషల్ మీడియాలో వైరల్ అయిన 90 సెకెన్ల వీడియోలో నిందితుడు బాధితురాలిని ఒక చేత్తో గోడకు అంటిపెట్టుకొని పదేపదే పొడిచాడు. బాలిక నేలపై పడిపోయినా అతడు ఆగలేదు. కత్తితో అనేక సార్లు పొడిచాడు. బాధితురాలిని కోపంతో తన్నాడు. అక్కడే ఉన్న సిమెంట్ రాయితో తలపై చాలా సార్లు బాదాడు. అయితే ఆ చుట్టు పక్కల జనాలు ఉన్నా.. అతడిని ఆపేందుకు ఎవరూ రాలేదు. వారంతా భయంతో చూస్తూనే ఉండిపోయారు. సాహిల్ అక్కడి నుంచి వెళ్లిపోతూ కూడా.. మళ్లీ వెనుదిరి వచ్చి సిమెంట్ రాయితో తలపై కొట్టి వెళ్లిపోయాడు. 

 హత్య చేసిన అనంతరం ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్ కు పారిపోయారు. ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు ప్రారంభించిన అనంతరం నిందితుడిని తండ్రిని వెంటబెట్టుకొని పోలీసులు బులంద్ షహర్ వెళ్లారు. అతేర్నా గ్రామంలో సాహిల్ అని అరెస్టు చేశారు. కాగా.. బాధితురాలు సాక్షి శరీరంపై 34 గాయాలు ఉన్నాయని, పుర్రె పగిలిందని, తుది శవపరీక్ష నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. 

ముస్లిం బాలికను ఇంట్లో డ్రాప్ చేశాడని హిందూ బాలుడిపై దాడి.. ఆమెతో ఎందుకు ఉన్నావని ప్రశ్నలు..

ఇదిలా ఉండగా.. ఢిల్లీ నగరంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాపైనే ఉంటుందని, సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఇతర ఆప్ నేతలు విమర్శలు గుప్పించారు. అయితే ఇది లవ్ జిహాద్ కేసు అని, దీనిని సాధారణ హత్యగా, శాంతిభద్రతల సమస్యగా చిత్రీకరించేందుకు ఆప్ ప్రయత్నిస్తోందని ఢిల్లీ బీజేపీ మండిపడింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios