Asianet News TeluguAsianet News Telugu

తప్పిన పెను ప్రమాదం.. బెళగావిలో ట్రైనింగ్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. పైలట్లకు గాయాలు

కర్ణాటకలోని బెళగావి జిల్లాలో ఓ శిక్షణ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ఇందులో ఉన్న ఇద్దరు ప్రయాణికులకు గాయాలు అయ్యాయ్యి. వారిని అధికారులు హాస్పిటల్ కు తరలించారు. 

Emergency landing of training plane in Belagavi.. Pilots injured..ISR
Author
First Published May 30, 2023, 1:21 PM IST

కర్ణాటకలోని బెళగావిలోని సాంబ్రా విమానాశ్రయం సమీపంలో రెండు సీట్ల శిక్షణ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. రెడ్ బర్డ్ ఏవియేషన్ కు చెందిన విమానంలోని ఇద్దరు పైలట్లు ఉన్నారు. అయితే ఎమర్జెన్సీ ల్యాండ్ చేసిన సమయంలో వారికి గాయాలు అయ్యాయి. వారిద్దరిని అధికారులు రక్షించారు. చికిత్స నిమిత్తం వెంటనే ఎయిర్ ఫోర్స్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. 

విమానంలో సాంకేతిక లోపాలు తలెత్తడంతో ల్యాండింగ్ చేసినట్టు తెలిపారు. కాగా.. ఈ నెల 24వ తేదీన రాజస్థాన్ లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఇండియన్‌ నేవీకి చెందిన రెండు హెలికాప్టర్లు అత్యవసరంగా ల్యాండ్ అయ్యాయి. దీంతో వాటికి పెను ప్రమాదం తప్పినట్లైంది. ఉన్నట్టుండి వాతావరణం ప్రతికూలంగా మారడంతో అప్రమత్తమైన పైలట్‌లిద్దరూ హెలికాపర్లను సురక్షితంగా ల్యాండ్ చేశారు.హెలికాప్టర్‌లకు ఎలాంటి నష్టం జరగకుండా వారు జాగ్రత్తపడ్డారు. 

ముస్లిం బాలికను ఇంట్లో డ్రాప్ చేశాడని హిందూ బాలుడిపై దాడి.. ఆమెతో ఎందుకు ఉన్నావని ప్రశ్నలు..

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అకస్మాత్తుగా వాతావరణం ప్రతికూలంగా మారడంతో రెండు ఆర్మీ హెలికాప్టర్లు బికనేర్‌లోని ఖరా గ్రామం సమీపంలో ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ప్రతికూల వాతావరణం కారణంగా ఆ రెండు హెలికాప్టర్లు కంట్రోల్ రూమ్‌తో సంబంధాలు కోల్పోయాయి. అలాంటి పరిస్థితిలో పైలట్ ఉద్దేశపూర్వకంగా హెలికాప్టర్‌ను జనావాస ప్రాంతానికి దూరంగా ముడి రహదారిపైకి దించాడు. రెండు హెలికాప్టర్లలోని పైలట్లు సురక్షితంగా ఉన్నారు. ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌లో ఎలాంటి నష్టం జరగలేదు. రెండు హెలికాప్టర్లలో మొత్తం నలుగురు పైలట్లు ఉన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios