Asianet News TeluguAsianet News Telugu

నేడు కేజ్రీవాల్, మనీష్ సిసోడియాల గుజ‌రాత్ ప‌ర్య‌ట‌న‌.. పోలీస్ ప్రొటెక్ష‌న్ కోరిన ఆప్

ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై సీబీఐ రైడ్, ఈడీ కేసులు వంటి పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీ నేతలు కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలు నేడు గుజరాత్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో నాయకులపై దాడి జరిగే అవకాశం ఉందని, వారికి పోలీసుల రక్షణ కావాలని ఆ పార్టీ కోరింది. 

Kejriwal Manish Sisodia visit Gujarat today.. App seeks police protection
Author
First Published Aug 22, 2022, 8:58 AM IST

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాలు నేటి (సోమ‌వారం) నుంచి రెండు రోజుల పాటు గుజరాత్ ప‌ర్య‌ట‌న చేయ‌నున్నారు. నేడు వారిద్ద‌రు అహ్మదాబాద్ చేరుకొని ప‌ర్య‌ట‌న తొలిరోజులో భాగంగా సబర్‌కాంత జిల్లాకు వెళ్లి హిమత్‌నగర్‌లో జరిగే సభలో ప్రసంగించనున్నారు.

“ మనీష్ జీ. నేను విద్య, ఆరోగ్య హామీ ఇవ్వ‌డానికి రెండు సోమవారం నుంచి రెండు రోజుల‌ పాటు గుజరాత్ వెళ్తున్నాం. ఢిల్లీలాగే గుజరాత్‌లోనూ మంచి పాఠశాలలు, మంచి ఆసుపత్రులు, మొహల్లా క్లినిక్‌లు ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఉచిత మంచి విద్య, చికిత్స అందుతుంది. ప్రజలు ఉపశమనం పొందుతారు. మేము యువకుల‌తో కూడా మాట్లాడుతాము ” అని కేజ్రీవాల్ హిందీలో ట్వీట్ చేశారు.

కుమార్తె దురుసు ప్రవర్తన.. తలదించుకున్న మిజోరాం ముఖ్యమంత్రి.. బహిరంగ క్షమాపణ చెబుతూ ట్వీట్..

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 అమలులో అవినీతి జ‌రిగిందంటూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఢిల్లీలోని మనీష్ సిసోడియా నివాసంతో పాటు మరో 30 చోట్ల దాడులు చోట్ల శుక్ర‌వారం దాడులు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ ప‌రిణామాల మ‌ధ్య ఈ ట్వీట్ ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. 

ఈ ఎక్సైజ్ పాలసీ కేసుపై వివాదం నేప‌థ్యంలో గుజరాత్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఇద్ద‌రు నాయ‌కుల‌కు మ‌రింత పోలీసు ర‌క్ష‌న క‌ల్పించాల‌ని ఆమ్ ఆద్మీ పార్టీ కోరింది. ఇక్క‌డ దాడి జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది. ఈ క్ర‌మంలో ఆప్ గుజరాత్ ఇన్‌ఛార్జ్ గులాబ్ సింగ్, రాష్ట్ర లీగల్ సెల్ ప్రెసిడెంట్ ప్రణవ్ ఠక్కర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఆదివారం పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ) కార్యాలయానికి ఒక  మెమోరాండం సమర్పించింది. ‘‘ అధికార పార్టీ భావజాలంతో ప్రేరణ పొందిన కొంతమంది సంఘ వ్యతిరేక వ్యక్తులు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలపై దాడికి ప్లాన్ చేస్తున్నారని కొన్ని వర్గాలు, మీడియాలోని మూలాల నుండి మాకు తెలిసింది ’’ అని మెమోరాండం పేర్కొంది.

“ఆమ్ ఆద్మీ పార్టీ, దాని నాయకులకు రాష్ట్రంలో పెరుగుతున్న ప్రజాదరణపై పాలక యంత్రాంగం అసంతృప్తిగా ఉంది. ఇక్క‌డ ఎలాంటి ఘటన ఏదైనా జరిగినా రాష్ట్ర ప్రతిష్టపై నల్ల మచ్చ పడుతుంది. కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా ఉండేందుకు, గుజరాత్ పర్యటన సందర్భంగా కేజ్రీవాల్, సిసోడియాలకు పోలీసులు మరింత రక్షణ కల్పించాలి. ’’ అని మెమోరాండంలో నాయకులు ఆప్ నాయ‌కులు పేర్కొన్నారు.

పేటీఎం సీఈవోగా మళ్లీ విజయ్ శేఖర్ శర్మ నియ‌మకం

ఈ ఏడాది ప్రారంభంలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన తర్వాత, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాలలోనూ విస్త‌రించ‌డానికి AAP ప్రయత్నాలు చేస్తోంది. త్వరలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆప్ 19 మంది అభ్యర్థులతో కూడిన రెండు జాబితాలను విడుదల కూడా ఇటీవ‌ల విడుద‌ల చేసింది. 

కేజ్రీవాల్ ఇటీవ‌ల గుజ‌రాత్ లో ప‌ర్య‌టించిన‌ప్పుడు రాష్ట్రం ప్ర‌జ‌ల‌కు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అలాగే యువతకు నెలవారీ నిరుద్యోగ భృతి వంటి హామీలను ప్రకటించారు. అయితే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ఇంకా ఖరారు చేయలేదు. 2017లో గుజరాత్‌లో డిసెంబర్‌లో ఎన్నికలు జరిగాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios