Asianet News TeluguAsianet News Telugu

పేటీఎం సీఈవోగా మళ్లీ  విజయ్ శేఖర్ శర్మ నియ‌మకం

అతిపెద్ద డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈవోగా విజయ్‌ శేఖర్‌ శర్మను తిరిగి నియమించేందుకు మెజారిటీ వాటాదారులు ఆమోదం తెలిపారు. పేటీఎం స్టాక్‌లో భారీ పతనం చోటు చేసుకుంది. గత ఏడాది పేటీఎం మార్కెట్ విలువ దాదాపు 60 శాతం పడిపోయింది. దీంతో విజయ్ శేఖర్ శర్మ నాయకత్వంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విజయ్ శేఖర్ శర్మకు కంపెనీలో 8.92 శాతం వాటా ఉంది.

Vijay Shekhar Sharma reappointed as MD and CEO of Paytm
Author
Hyderabad, First Published Aug 22, 2022, 4:49 AM IST

దేశంలోనే అతిపెద్ద డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈవో గా విజయ్ శేఖర్ శర్మ తిరిగి ఎన్నిక‌య్యాడు. వరుస నష్టాలతో సతమతమవుతున్న పేటీఎం మాతృ సంస్థ ‘వన్‌ 97 కమ్యూనికేషన్స్‌’  విజయ్ శేఖర్ శర్మ ను సీఈఓ పదవి నుండి తొలగించే చర్చ జరిగింది. కానీ పేటీఎం వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో మరోసారి ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని చూరగొనడంతో ఆయననే ఏండీ, సీఈవోగా తిరిగి నిమ‌మించారు. వార్షిక సాధారణ సమావేశానికి వారం ముందు.. అడ్వైజరీ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ (ఐఐఏఎస్‌) విజయ్ శేఖర్ శర్మ నాయకత్వంపై ప్రశ్నలు లేవనెత్తింది.

60 శాతానికి పైగా ప‌త‌నం

పేటీఎం స్టాక్‌లో భారీ పతనం చోటు చేసుకుంది. గత ఏడాది లిస్టింగ్ తర్వాత గణాంకాలను పరిశీలిస్తే..  పేటీఎం మార్కెట్ విలువ దాదాపు 60 శాతం పడిపోయింది. దీంతో విజయ్ శేఖర్ శర్మ నాయకత్వంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆయ‌న‌ను సీఈఓగా త‌ప్పించాల‌ని భావించారు. అయితే.. షేర్‌హోల్డర్లు మరోసారి ఆయనపై విశ్వాసముంచ‌డంతో సీఈఓ, మేనేజింగ్ డైరెక్ట‌ర్ గా విజ‌య్ శేఖ‌ర్ శ‌ర్మ‌ను తిరిగి ఆమోదించారు.కంపెనీని లాభాల బాట పట్టించేందుకు విజయ్ శేఖర్ శర్మ ఎన్నో వాగ్దానాలు చేశారని, అయితే వాటిని నెరవేర్చలేదని ఐఐఏఎస్ ఇటీవల పేర్కొంది. నిర్వహణను ప్రొఫెషనల్‌గా మార్చడాన్ని బోర్డు పరిగణించాలని  పేర్కొంది.

కంపెనీ ఎప్పుడు లాభదాయకంగా మారుతుంది?

నివేదిక ప్రకారం.. సెప్టెంబర్ 2023 నాటికి కంపెనీ లాభదాయకంగా మారుతుందని వాటాదారులు అంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పేటీఎం రూ.644 కోట్ల నష్టాన్ని చవిచూసింది. అయితే.. ఈ కాలంలో కంపెనీ ఆదాయం 86 శాతం పెరిగింది. 2019 వరకు కంపెనీ దృష్టి అంతా విస్తరణపైనే ఉందని విజయ్ శేఖర్ శర్మ చెప్పారు. దీని తర్వాత కంపెనీ మానిటైజేషన్‌పై దృష్టి సారించింది. పేటీఎంలో దాదాపు 30 మిలియన్ల మంది వ్యాపారులు ఉన్నారని, మరింత మంది వ్యాపారులకు సేవను విస్తరించాల్సిన అవసరం ఉందని కంపెనీ విశ్వసిస్తోందని విజయ్ శేఖర్ శర్మ చెప్పారు. ఇందుకోసం మార్కెటింగ్‌ టీమ్‌ పనిచేస్తోందని తెలిపారు.
 
విజయ్ శర్మకు ఎంత వాటా ఉంది?

బీఎస్ఈ లో అందుబాటులో ఉన్న షేర్ హోల్డింగ్ డేటా ప్రకారం.. శర్మ నేరుగా కంపెనీలో 8.92 శాతం వాటాను కలిగి ఉన్నారు. అదే సమయంలో, యాంట్‌ఫిన్ (నెదర్లాండ్స్) హోల్డింగ్  బీవీ లో 24.88 శాతం,  ఎస్వీఎఫ్ ఇండియా హోల్డింగ్స్ (కేమాన్) లిమిటెడ్ లో 17.46 శాతం, ఎస్ ఏఐఎఫ్  III మారిషస్ కంపెనీ లిమిటెడ్ లో 10.59 శాతం, అలీబాబా. క‌మ్ సింగపూర్ ఇ-కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో 6.26 శాతం, ఎస్ ఏఐఎఫ్ పార్టనర్స్ ఇండియా IV లిమిటెడ్ లో 4.50 శాతం వాటాలున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios