Asianet News TeluguAsianet News Telugu

కుమార్తె దురుసు ప్రవర్తన.. తలదించుకున్న మిజోరాం ముఖ్యమంత్రి.. బహిరంగ క్షమాపణ చెబుతూ ట్వీట్..

కూతురు దురుసు ప్రవర్తనకు మిజోరాం ముఖ్యమంత్రి సారీ చెప్పారు. ట్విట్టర్ వేదికగా బహిరంగ క్షమాపణ చెబుతూ తన చేతి రాతతో ఉన్న నోట్ ను షేర్ చేశారు.

CM says sorry after daughter assaults doctor In Mizoram
Author
Hyderabad, First Published Aug 22, 2022, 7:02 AM IST

గువాహటి : తప్పు చేస్తే ఎంతటి వారైనా తలొగ్గక తప్పదు. అలాంటి పరిస్థితే ఎదురయ్యింది ఓ ముఖ్యమంత్రికి.. కుమార్తె చేసిన తప్పుకు బేషరతుగా క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. తండ్రి ముఖ్యమంత్రి అన్న అహమో..తానేం చేసినా చెల్లుతుందన్న భావనో కానీ ఆమె చేసిన పనికి స్వయంగా ముఖ్యమంత్రే తల దించుకోవాల్సి వచ్చింది. ఈ ఘటన మిజోరాంలో జరిగింది. వివరాల్లోకి వెడితే...

తన కుమార్తె దురుసు ప్రవర్తన పట్ల మిజోరాం ముఖ్యమంత్రి జోరంతంగా స్పందించారు. ఓ వైద్యుడిపై ఆమె దాడిచేసిన ఘటనపై విమర్శలు రావడంతో ఆయన బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. వివరాల్లోకి వెళితే… మిజోరాం రాజధాని ఐజ్వాల్ లో సీఎం కుమార్తె మిలారీ చాంగ్టే ఇటీవల ఓ క్లినిక్ కి వెళ్లారు. అయితే, అపాయింట్మెంట్ లేకుండా తాను చూడనని, క్లినిక్ కు వచ్చేముందు అపాయింట్మెంట్ తీసుకోవాల్సిందేనని డెర్మటాలజీ డిపార్ట్ మెంట్ కు చెందిన వైద్యుడు తేల్చి చెప్పారు.

సీఎం కాన్వాయ్‌పై రాళ్ల‌ దాడి.. త‌ప్పిన పెను ప్ర‌మాదం

దీంతో కోపానికి వచ్చిన చాంగ్టే క్లినిక్ లో అందరూ చూస్తుండగానే వైద్యుడి వద్దకు వెళ్లి అతని ముఖంపై దాడి చేసింది. అయితే, అక్కడ ఉన్న కొందరు ఆమెను అడ్డుకున్న దృశ్యాలు సోషల్ మీడయాలో వైరల్గా మారాయి. గత రెండు రోజులుగా ఈ అంశంపై ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో విమర్శలు  వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) మిజోరం శాఖ ఆధ్వర్యంలో నిరసనలు మొదలయ్యాయి. 

నిన్న వైద్య సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. దీంతో చివరికి ముఖ్యమంత్రి తన కూతురు చేసిన పనికి బహిరంగ క్షమాపణలు చెబుతూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు. ఐజ్వాల్ కు చెందిన డెర్మటాలజిస్ట్ తో తన కుమార్తె తప్పుగా ప్రవర్తించినందుకు క్షమాపణలు చెబుతున్నానని ఆమె ప్రవర్తన ఏ విధంగాను సమర్ధనీయం కాదని పేర్కొంటూ తన చేతి రాతతో ఉన్న నోట్ ను షేర్ చేశారు 


 

Follow Us:
Download App:
  • android
  • ios