"ఆ విషయంలో రెండో భార్యకు ఫిర్యాదు చేసే అర్హత లేదు'
భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్ 498A పై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ సెక్షన్ ప్రకారం కింద 46 ఏళ్ల వ్యక్తికి విధించిన శిక్షను కర్ణాటక హైకోర్టు రద్దు చేసింది.

ఐపీసీ సెక్షన్ 498ఏ విషయం కర్ణాటక హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఈ సెక్షన్ ప్రకారం 46 ఏళ్ల వ్యక్తికి దిగువ కోర్టు విధించిన శిక్షను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. ఆ వ్యక్తి రెండో భార్య ఫిర్యాదు చేసిందని, అసలు వారి వివాహమే ఆమోదయోగ్యం కాదని కోర్టు పేర్కొంది. జస్టిస్ ఎస్. రాచయ్యతో కూడిన సింగిల్ బెంచ్ ఇటీవల ఇచ్చిన తీర్పులో.. ప్రాసిక్యూషన్ సాక్షి నంబర్ -1 (పిటిషనర్) రెండవ భార్యగా పరిగణించబడితే.. ఐపిసి సెక్షన్ 498-ఎ ప్రకారం.. ఆ పిటిషనర్( రెండవ భార్య) దాఖలు చేసిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకోలేమని తెలిపింది.
మరో మాటలో చెప్పాలంటే, భర్త , అతని తల్లిదండ్రులపై రెండవ భార్య దాఖలు చేసిన ఫిర్యాదు నిర్వహించదగినది కాదని ధర్మాసనం పేర్కొంది. కింది కోర్టులు ఈ అంశంలో సూత్రాలు, చట్టాన్ని వర్తింపజేయడంలో తప్పు చేశాయనీ, కాబట్టి.. పునర్విమర్శ అధికార పరిధిలో హై కోర్టు ఈ తీర్పు విషయంలో జోక్యం చేసుకుంటున్నట్టు పేర్కొంది.
ఇదీ సంగతీ..
తుమకూరు జిల్లా విట్టవటనహళ్లి నివాసి కాంతరాజు దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది. ఫిర్యాదు చేసిన మహిళ తాను కాంతరాజుకు రెండో భార్యనని, తాము ఐదేళ్లుగా సహజీవనం చేశామని, ఒక కుమారుడు కూడా ఉన్నారని పేర్కొంది. ఆ తర్వాత తనకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయని, పక్షవాతం సోకి వికలాంగురాలిగా మారిందని ఆ మహిళ ఫిర్యాదులో పేర్కొంది. కాంతరాజు ఆ తర్వాత ఆమెను వేధించడం ప్రారంభించాడని, క్రూరత్వం, మానసిక హింసకు గురిచేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ మహిళ కాంతరాజుపై ఫిర్యాదు చేయగా, తుమకూరులోని ట్రయల్ కోర్టు విచారణ అనంతరం జనవరి 18, 2019న కాంతరాజును దోషిగా నిర్ధారించింది. అక్టోబర్ 2019లో.. సెషన్స్ కోర్టు శిక్షను ఖరారు చేసింది. దీంతో కాంతరాజు 2019లో రివిజన్ పిటిషన్‌తో హైకోర్టును ఆశ్రయించారు.
దిగువ కోర్టు నిర్ణయం రద్దు
సెక్షన్ 498ఏ కింద రెండో భార్యకు ఫిర్యాదు చేసే అర్హత లేదని కింది కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది. శివచరణ్ లాల్ వర్మ కేసు, పి.శివకుమార్ కేసు అనే రెండు సుప్రీం కోర్టు తీర్పులను ప్రస్తావిస్తూ.. “భార్య భర్తల మధ్య వివాహం శూన్యంగా ముగిసినట్లయితే, IPC సెక్షన్ 498A ప్రకారం నేరాన్ని కొనసాగించలేమని సుప్రీం కోర్టు ఇచ్చిన ఈ రెండు తీర్పుల ద్వారా స్పష్టమైంది” అని హైకోర్టు పేర్కొంది. కాంతరాజుకు విధించిన శిక్షను పక్కన పెడుతూ, ఆ మహిళ పిటిషనర్‌కు రెండో భార్య అని రుజువు చేసిన సాక్ష్యాధారాలను కోర్టు పేర్కొంది.