పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్ మరణం పట్ల ఆయన సొంత రాష్ట్రం కర్ణాటక శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన మృతికి సంతాప సూచికంగా కర్ణాటక ప్రభుత్వం మూడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది.

అనంతకుమార్ మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి... ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సోమవారం రాష్ట్రంలో సెలవు దినంగా ప్రకటించడంతో పాటు ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కాగా అనంతకుమార్ మృతికి సంతాపంగా ఇవాళ దేశవ్యాప్తంగా జాతీయ జెండాను అవనతం చేయాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న అనంతకుమార్ బెంగళూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున ఆయన ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. 

కేంద్ర మంత్రి అనంతకుమార్ కన్నుమూత

అనంత్‌కుమార్ కన్నుమూత...ఆత్మబంధువుని కోల్పోయా: ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్