కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ‘పేసీఎం’ క్యాంపెయిన్ మాదిరిగానే మధ్యప్రదేశ్ లో ఓ క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. సీఎం చౌహాన్ అవినీతికి పాల్పడ్డారంటూ ఫోన్ పే లోగోపై ఆయన ఫొటో పెట్టి పోస్టర్లు ముద్రించింది. అయితే దీనిపై ఫోన్ పే అభ్యంతరం వ్యక్తం చేసింది.
కర్ణాటక లో విజయవంతమైన ఓ ఫార్ములాను కాంగ్రెస్ మధ్యప్రదేశ్ లోనూ అమలు చేసింది. బీజేపీ నాయకుడు, సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఫోన్ పే లోగోపై ఆయన ఫొటో పెట్టి పోస్టర్లను అతికించింది. అయితే దీనిపై ఆ డిజిటల్ పేమెంట్స్ కంపెనీ మండిపడింది. పోస్టర్లలో తమ లోగోను ఉపయోగించడంపై ఫోన్ పే అభ్యంతరం వ్యక్తం చేసింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ), కాంగ్రెస్ మధ్య పోస్టర్ల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో సీఎం చౌహాన్ సింగ్ కమీషన్ తీసుకొని పనులు చేస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ రాజధాని నగరం భోపాల్ అంతటా పోస్టర్లను అంటించింది. చౌహాన్ ఫొటోతో ఉన్న క్యూఆర్ కోడ్ ఉన్న పోస్టర్లలో ‘‘50% లావో, ఫోన్ పే కామ్ కరావో (మీ పనిని పూర్తి చేయడానికి 50% కమీషన్ చెల్లించండి)’’ అని రాసి ఉంది.
ఈ పోస్టర్ల పై ఫోన్ పే సోమవారం ట్విటర్ లో స్పందించింది, పోస్టర్ల నుండి దాని లోగోను తొలగించాలని కోరింది. ‘‘రాజకీయ లేదా రాజకీయేతర ఏదైనా థర్డ్ పార్టీ తన బ్రాండ్ లోగోను అనధికారికంగా ఉపయోగించడం సరైంది కాదు’’ అని పేర్కొంది. ఫోన్ పే బ్రాండ్, లోగోతో ఉన్న పోస్టర్లను తొలగించాలని కాంగ్రెస్ పార్టీని కోరింది. తమ లోగోను అనధికారికంగా ఉపయోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కంపెనీ తెలిపింది.
భీమ్ ఆర్మీ చీఫ్ ఆజాద్ పై బుల్లెట్ల దాడి.. హాస్పిటల్ నుంచే మద్దతుదారులకు సందేశం.. ఏం చెప్పారంటే ?
ఫోన్ పే బ్రాండ్ లోగోను రాజకీయ, రాజకీయేతర తృతీయపక్షం అనధికారికంగా ఉపయోగించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘‘మాకు ఏ రాజకీయ ప్రచారంతో గానీ, పార్టీతో గానీ సంబంధం లేదు. ఫోన్ పే లోగో అనేది మా కంపెనీ రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్. ఫోన్ పే యొక్క మేధో సంపత్తి హక్కులను అనధికారికంగా ఉపయోగించడం చట్టపరమైన చర్యలను ఆహ్వానిస్తుంది. మా బ్రాండ్, లోగోతో ఉన్న పోస్టర్లను తొలగించాలని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ను వినమ్రంగా కోరుతున్నాం’’ అని ఆ కంపెనీ ట్వీట్ చేసింది.
మధ్యప్రదేశ్ లో పోస్టర్ వార్.. ఇటీవల ముగిసిన కర్ణాటక ఎన్నికలను పోలి ఉంది. ఆ దక్షిణాది రాష్ట్రంలో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ‘పేసీఎం’ పోస్టర్ క్యాంపెయిన్ నిర్వహించింది.
