త్రిపురలో నిర్వహించిన జగన్నాథ రథయాత్ర సందర్భంగా విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్ తో ఏడుగురు మరణించారు. మరి కొందరికి గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించారు. 

త్రిపురలోని ఉల్టా రథయాత్రలో చోటు చేసుకున్న దుర్ఘటనపై ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. కుమార్ఘాట్ వద్ద ఉల్తా రథయాత్ర సందర్భంగా జరిగిన ప్రమాదం బాధాకరమన్నారు. ఈ దుర్ఘటనలో తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు.

ఢిల్లీ మెట్రోలో భారీ ఫైట్.. దారుణంగా కొట్టుకున్న ఇద్దరు వ్యక్తులు.. వైరల్ అవుతున్న వీడియో

క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. బాధితులకు స్థానిక యంత్రాంగం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తోందని ఆయన ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు ఎక్స్ గ్రేషియా అందిస్తామని ప్రకటించారు.

అసలేం జరిగిందంటే ? 
త్రిపుర రాష్ట్రంలోని ఉనాకోటి జిల్లాలో ఉన్న కుమార్‌ఘాట్‌లో ప్రతీ ఏటా జగన్నాథుడి ఉల్టా రథయాత్రను నిర్వహిస్తారు. అందులో భాగంగా ఈ సారి కూడా బుధవారం ఈ యాత్ర ఊరేగింపు మొదలుపెట్టారు. ఈ కార్యక్రమాన్ని చూసి తరించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అయితే ఈ రథాన్ని ఇనుముతో తయారు చేసి భారీగా అలంకరించారు. దానిని భక్తులందరూ లాగుతున్నారు. ఈ సమయంలో ఈ రథం పై భాగం ఒక్క సారిగా హైటెన్షన్ విద్యుత్ వైర్లను తాగింది. 

పొలంలో నాట్లు వేస్తుండగా తెగిపడ్డ 11 కేవీ విద్యుత్ తీగ.. నలుగురు మహిళలు మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం

దీంతో ఆ రథాన్ని లాగుతున్న వారు, పట్టుకున్నవారందరికీ కరెంట్ షాక్ వచ్చింది. అదే సమయంలో మంటలు కూడా చెలరేగాయి. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 18 మందికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్పందించిన పోలీసులు, తోటి భక్తులు వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్ధితి విషమంగా వున్నట్లు సమాచారం.

బీహార్ లో కూలిన మరో వంతెన.. ఒకే నెలలో ఇది మూడో ఘటన

ఈ ఘటనపై సమాచారం అందగానే త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా వెంటనే ఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని స్వయంగా సమీక్షించారు. త్రిపుర చరిత్రలో ఇలాంటి దురదృష్టకర సంఘటన ఎప్పుడూ జరగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు.