కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ కు ముందు జేడీఎస్ అధినేత హెచ్ డీ కుమార స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనది చిన్న పార్టీ అని అన్నారు. తనకు ఎలాంటి డిమాండ్ లేదని తెలిపారు. తన పార్టీ అవసరం ఎవరికీ లేదని చెప్పారు. 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జనతాదళ్ సెక్యులర్ నేత హెచ్ డీ కుమారస్వామి మీడియాతో మాట్లాడారు. జేడీఎస్ చిన్న పార్టీ అని, తాను అభివృద్ధిని మాత్రమే చూస్తున్నానని అన్నారు. ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ, కాంగ్రెస్ లకు భారీ మెజార్టీ వస్తుందని తేలిందన్నారు. తమది చిన్న పార్టీ అని, తమ అవసరం ఎవరికీ లేదని అన్నారు.

మనస్థాపంతో జేపీఎస్ బైరి సోని ఆత్మహత్య.. న్యాయం చేయాలని ఉద్యోగుల ఆందోళన, క్యాండిల్ ర్యాలీ..

మరో 2-3 గంటల్లో ఈ విషయం స్పష్టమవుతుందని చెప్పారు. ‘‘ 2-3 గంటల్లో ఈ విషయం తేటతెల్లం కానుంది. రెండు జాతీయ పార్టీలు భారీ స్థాయిలో స్కోర్ చేస్తాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. జేడీఎస్ కు 30-32 సీట్లు వస్తాయని సర్వేలు చెబుతున్నాయి. నాది చిన్న పార్టీ, నాకు డిమాండ్ లేదు... మంచి అభివృద్ధి జరగాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని కుమారస్వామి పేర్కొన్నారు.

కాగా.. కర్ణాటకలో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. వాటిలో కొన్ని కాంగ్రెస్ కు అధిక స్థానాలు వస్తాయని అంచనా వేసినప్పటికీ.. ఆ పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బలం సరిపోదు. ఈ నేపథ్యంలో జేడీఎస్ కింగ్ మేకర్ గా అవతరిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఎన్నికల అనంతరం జేడీఎస్ బీజేపీతో లేదా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటుందా అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. 

వాట్సాప్ లో వచ్చిన లింక్ క్లిక్ చేస్తే.. బ్యాంకు ఖాతాలో రూ.6.16 లక్షలు ఖాళీ!

అయితే 2018లో బీజేపీకి వ్యతిరేకంగా జేడీఎస్.. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది. అయితే ఈ సారి ఆ పార్టీతో పొత్తు ఉండదని కుమారస్వామి తండ్రి, మాజీ ప్రధాని దేవెగౌడ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీలకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో రెండు పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పోటీ పడితే కచ్చితంగా జేడీఎస్ కింగ్ మేకర్ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా.. కాంగ్రెస్ కర్ణాటక చీఫ్ డీకే శివకుమార్, బీజేపీ అభ్యర్థి బసవరాజ్ బొమ్మై ఇద్దరూ కూడా ఈ సారి తమ పార్టీయే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

ఆర్యన్ ఖాన్‌ను అరెస్టు చేసిన అధికారి సమీర్ వాంఖేడ్ పై అవినీతి కేసు.. తనిఖీలు చేస్తున్న సీబీఐ

కర్ణాటకలో అసెంబ్లీలో మొత్తం 224 స్థానాలు ఉన్నాయి. మొత్తం స్థానాలకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఒకే దశలో మే 10వ తేదీన ఎన్నికలు నిర్వహించింది. ఈరోజు ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే దీని కోసం అధికారులు కౌంటింగ్ కూడా మొదలుపెట్టారు. మరి కొన్ని గంటల్లో కర్ణాటక పీఠం ఎవరిదో తేలిపోనుంది.