అమ్మాయి అనుకొని ప్రేమించాడు.. తీరా ముసుగుతీసి చూస్తే..!

తాను ప్రేమించింది ఓ అమ్మాయి అనే అనుకున్నాడు. కానీ... ముఖానికి ఉన్న స్కార్ఫ్ చూస్తే కానీ.... అబ్బాయి అని తెలియలేదు. ఈ సంఘటన ఎక్కడ జరిగింది అని క్లారిటీ లేదు కానీ... వీడియో మాత్రం నెట్టింట వైరల్ గా మారింది.

man cheated youth name of girl, video goes viral on social media ram


ఈమధ్యకాలంలో ఆన్ లైన్ ప్రేమలు ఎక్కువయ్యాయి. ముక్కు, మొహం తెలీకుండానే ప్రేమించేస్తున్నారు. కొన్నిసార్లు అయితే... కనీసం వారు ప్రేమిస్తోంది.. అమ్మాయో, అబ్బాయో కూడా తెలియడం లేదు. తాజాగా.. ఓ యువకుడికి కూడా ఇలాంటి పరిస్థితే ఏర్పడింది. కనీసం ముఖం చూడకుండా ప్రేమించాడు. తాను ప్రేమించింది ఓ అమ్మాయి అనే అనుకున్నాడు. కానీ... ముఖానికి ఉన్న స్కార్ఫ్ చూస్తే కానీ.... అబ్బాయి అని తెలియలేదు. ఈ సంఘటన ఎక్కడ జరిగింది అని క్లారిటీ లేదు కానీ... వీడియో మాత్రం నెట్టింట వైరల్ గా మారింది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే...

 

ఓ యువకుడికి ఓ అమ్మాయి పేరుతో సోషల్ మీడియా ఎకౌంట్ కి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. అమ్మాయి కదా అనుకొని వెంటనే రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశాడు. అప్పటి నుంచి ఇద్దరూ సోషల్ మీడియాలో చాటింగ్ చేసుకోవడం మొదలుపెట్టారు. చక్కగా మాట్లాడుతోంది కదా అని... ఈ అబ్బాయి ప్రపోజ్ చేశాడు. ఆ ప్రపోజల్ కి ఆమె కూడా ఓకే చెప్పింది. చాలా రోజులు చాటింగ్ చేసిన తర్వాత....ఒకరోజు కలుసుకుందామని ప్లాన్ చేసుకున్నారు.

అయితే... ఎప్పుడూ ముఖం చూపించని ఆ అమ్మాయి.. బయట కలిసినప్పుడు కూడా స్కార్ఫ్ కట్టుకొని వచ్చింది. ఇలా అయితే... ముఖం చూడటం కష్టమని బలవంతంగా స్కార్ఫ్ లాగి చూశాడు. అంతే... అతనికి ఊహించని షాక్ తగిలింది. ఇన్నాళ్లు.. తాను ప్రేమించింది ఓ అమ్మాయిని కాదని.. అబ్బాయి అని తెలిసి షాకయ్యాడు. ఈ వీడియోని   'ఘర్‌కే కలేష్' అనే ఇన్‌స్టాగ్రాం ఖాతా ద్వారా పోస్ట్ చేయగా... వీడియో వైరల్ గా మారింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios