Asianet News TeluguAsianet News Telugu

10 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు కేంద్రం పనిచేస్తోంది: ప్ర‌ధాని నరేంద్ర మోడీ

Delhi: "కేంద్ర ప్రభుత్వం పది లక్షల ఉద్యోగాలు కల్పించే పనిలో ఉంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా దీనితో సంబంధం క‌లిగివున్నాయి" అని ప్రధాని న‌రేంద్ర మోడీ అన్నారు. యువతకు ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ఆయన అన్నారు.
 

Center working to create 10 lakh jobs: PM Narendra Modi
Author
First Published Oct 30, 2022, 11:44 AM IST

Prime Minister Narendra Modi: పది లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గుజరాత్ ప్రభుత్వం నిర్వహించిన 'రోజ్‌గార్ మేళా' (ఉపాధి మేళా) సందర్భంగా వీడియో సందేశంలో ప్రధాని మాట్లాడుతూ దేశంలో యువతకు ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య పెరుగుతుందని చెప్పారు. దీని కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. గుజరాత్ లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగున్నాయి. ఈ క్ర‌మంలోనే అక్క‌డి రాజ‌కీయ పార్టీలు ప్ర‌చారం కొన‌సాగిస్తున్నాయి. బీజేపీ సైతం ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో ఆ పార్టీ అగ్ర‌నాయ‌క‌త్వం వ‌రుస ప‌ర్య‌ట‌న‌లు చేస్తోంది. ఈ క్ర‌మంలోనే బీజేపీ పాలిత రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన ఈ కార్యక్రమంలో 5,000 మంది వ్యక్తులు గుజరాత్ పంచాయతీ సర్వీస్ బోర్డ్ నుండి అపాయింట్‌మెంట్ లెటర్‌లను పొందగా, 8000 మందికి గుజరాత్ సబ్ ఇన్‌స్పెక్టర్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ లో క్ర‌క్షక్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ద్వారా అపాయింట్‌మెంట్ లెటర్స్ అందించబడ్డాయి.

గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నియామక పత్రాలను పంపిణీ చేశారు. "ధన్‌తేరస్ పవిత్రమైన రోజున, మేము జాతీయ స్థాయిలో రోజ్‌గార్ మేళాను నిర్వహించాము. అక్కడ మేము 75,000 మంది అభ్యర్థులకు అపాయింట్‌మెంట్ లెటర్‌లను పంపిణీ చేసాము" అని ప్రధాని మోడీ తన ప్రసంగంలో తెలిపారు. రాబోయే నెలల్లో జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఇలాంటి మేళాలు నిర్వహిస్తామని చెప్పారు. పది లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా ప్రచారంతో ముడిపడి ఉన్నాయనీ, యువతకు ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ప్ర‌ధాని చెప్పారు. "మీ అపాయింట్‌మెంట్ లాస్ట్-మైల్ డెలివరీ-ప్రభుత్వ పథకాల కవరేజీ సంతృప్తత కోసం ప్రచారాలను భారీగా బలపరుస్తుంది" అని కొత్త రిక్రూట్‌లతో అన్నారు.

గుజరాత్ కొత్త పారిశ్రామిక విధానానికి ఉద్యోగావకాశాలు కల్పించడంతోపాటు 3వ తరగతి, 4వ తరగతి ప్రభుత్వ పోస్టులకు ఇంటర్వ్యూ ప్రక్రియను రద్దు చేయడం వంటి సంస్కరణలను ప్రధాని మోడీ ప్రశంసించారు. "2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే మా లక్ష్యం. రాబోయే 25 ఏళ్లు దేశానికి చాలా కీలకమైనవనీ, మాకు చాలా అభివృద్ధి అవసరమనీ, మీరు సమాజం-దేశం పట్ల మీ కర్తవ్యాన్ని నెరవేర్చాలి" అని ప్ర‌ధాని మోడీ అన్నారు. 2022లో గుజరాత్ ప్రభుత్వం ఏడాదిలో 35,000 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలనే తన లక్ష్యాన్ని దాదాపుగా చేరుకుందని ప్రధాని చెప్పారు. కాగా, ప్ర‌ధాని నేడు గుజ‌రాత్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ప‌లు కీల‌క ప్రాజెక్టుల‌ను ప్రారంభించ‌నున్నారు. టాటా-ఎయిర్బస్ కన్సార్టియం తయారీ కేంద్రానికి ఆదివారం నాడు శంకుస్థాపన చేయ‌నున్నారు. ఇది  ప్రయివేటు రంగంలో దేశంలో మొట్టమొదటి విమాన తయారీ కేంద్రం. ఆత్మనిర్భరత,  (స్వావలంబన) దిశగా ఒక కీలకమైన అడుగుగా దీనిని చూడవచ్చు. భారత వైమానిక దళం (ఐఏఎఫ్) విమానాలను ఆధునీకరించడమే లక్ష్యంగా ఈ సీ-295 విమానం తయారీ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం సుమారు ₹ 21,935 కోట్లు అని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios