Asianet News TeluguAsianet News Telugu

న్యూఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం: గాలి నాణ్యత 367 గా నమోదు

దేశ రాజధానిలో  ఢిల్లీలో గాలిలో నాణ్యత పడిపోయింది. ఇవాళ ఉదయం  గాలిలో  నాణ్యత 367 గా నమోదైంది.  దీపావళి  సందర్భంగా బాణసంచా  కాల్చడంతో  గాలిలో నాణ్యత  తగ్గిందని అధికారులు  చెబుతున్నారు. 

Delhi records very poor air quality, AQI at 367
Author
First Published Oct 30, 2022, 12:09 PM IST


న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గాలిలో  నాణ్యత  భారీగా  తగ్గింది. ఆదివారం నాడు  ఉదయం  గాలి నాణ్యత సూచిక  (ఎక్యూఐ) 367గా  నమోదైంది. ఇవాళ  ఉదయం  న్యూఢిల్లీలో  హ్యుమిడీటీ  70 శాతంగా  నమోదైందని భారత  వాతావరణ శాఖ వివరించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో  గాలి నాణ్యత దారుణంగా ఉందని వాతావరణ శాఖ  అధికారులు  చెబుతున్నారు. ఢిల్లీలోని  ఎన్‌ఎస్ఐటీ ద్వారకలో  411, జహంగీర్ పురిలో 407,వివేక్ విహార్  లో 423,  వజీర్ పూర్  లో  412, ఆనంద్ విహార్ లో  గాలి  నాణ్యత  468 గా నమోదైందని వాతావరణ  శాఖ  వివరించింది.

ఢిల్లీలో గాలి  నాణ్యత తగ్గిపోవడంతో  గ్రెడెడ్  రెస్పాన్స్  యాక్షన్ ప్లాన్ దశ మూడును అమలు  చేయాలని  ఆదేశించింది. జాతీయ భద్రత, రక్షణ,రైల్వేలు, మెట్రో రైలుకు  సంబంధించిన ముఖ్యమై ప్రాజెక్టులు మినహా ఇతర  నిర్మాణాల కూల్చివేతలపై  కూడా  నిషేధం  అమల్లో ఉంది. ఎయిర్  క్వాలీటీ  అధ్వాన్నంగా ఉన్నందున ఎన్‌సీఆర్‌లో బీఎస్ మూడు, పెట్రలో , బీఎస్  నాలుగు డీజీల్  వాహనాలపై అంక్షలు  విధించే  అవకాశం ఉందని  సమాచారం. ఢిల్లీలో గాలి  నాణ్యత  నిన్న సాయంత్ర 397గా నమోదైంది. ఈ  ఏడాది జనవరి తర్వాత  గాలి  నాణ్యత  ఇంత దారుణంగా  పడిపోవడం ఇప్పుడేనని అధికారులు చెబుతున్నారు. దీపావళి  సందర్భంగా బాణసంచా  కాల్చడం  ద్వారా గాలి నాణ్యత భారీగా  పడిపోయిందని  అధికారులు  చెబుతున్నారు.  ఈ నెల  24న  ఢిల్లీలో గాలిలో నాణ్యత 312గా నమోదైంది. ఈ  నెల25న  312,  ఈ  నెల  26న 354 గా నమోదైంది.

నగరంలోని  ప్రధాన సిగ్నల్స్ వద్ద  వాలంటీర్లను మోహరించి సిగ్నల్  దాటే వరకు వాహనాల ఇంజన్లను నిలిపివేసేలా  వాహన చోదకులను డ్రైవ్ చేయడంపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్  వినయ్ కుమార్  సక్సేనా   పునరాలోచన చేయాలని సీఎంను  కోరారు. రెడ్ లైట్య్  ఆన్  గాడీ ఆఫ్  అనే  ప్రచారం  కోసం ఢిల్లీలోని 100  సిగ్నల్స్ వద్ద 2500 మంది వలంటీర్లను  నియమించాలని  ఢిల్లీ సర్కార్  తలపెట్టింది. వాయి కాలుష్యం కారణంగా  సిగ్నల్స్ వద్ద పనిచేసే వలంటీర్ల  ఆరోగ్యం  దెబ్బతినే అవకాశంఉందని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అభిప్రాయపడ్డారు. మరోవైపు ఢిల్లీలో ఇవాళ 15 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత  నమోదైంది. 

వాయు కాలుష్యంపై  ఆప్, బీజేపీ పరస్పర విమర్శలు 

న్యూఢిల్లీలో పౌరసంస్థల ఎన్నికలకు ముందు ఆప్ ,బీజేపీల మధ్య గాలిలో నాణ్యతపై పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి.నగరంలోని కొన్ని ప్రాంతాల్లో  గాలి నాణ్యత 400దాటింది. దీంతో  వాయు  కాలుష్యాన్ని తగ్గించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక మేరకు వాయు కాలుష్యం  సాధారణం కంటే  40 నుండి 60 రెట్లు ఎక్కువగా నమోదైనట్టుగా అధికారులు చెబుతున్నారు.రెడ్ లైట్  ఆన్ గాడీఈప్ ప్రచారాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ ఉద్దేశ్యపూర్వకంగా ఆమోదించలేదని ఆప్ కార్యకర్తలు ఢిల్లీ లెప్టినెంట్ కార్యాలయం ముందు ధర్నా చేశారు.దేశ రాజధాని న్యూఢిల్లీలో దీపావళి తర్వాత గాలిలో నాణ్యత బాగా  పడిపోయిందని  వాతావరణశాఖాధికారులు చెబుతున్నారు.పంజాబ్ ,హర్యానా నుండి కూడ కాలుష్య కారకాలు ఢిల్లీ వైపునకు వస్తున్నాయి.గాలి  ప్రశాంతంగా ఉన్న కారణంగా కాలుష్యం గాలిలో ఎక్కువ సేపు  ఉంటుందని వాతావరణశాఖాధికారులు చెబుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios