Asianet News TeluguAsianet News Telugu

కాల్చేందుకు సిగరెట్ ఇవ్వలేదని స్నేహితుడి హత్య.. ఆగ్రాలో ఘటన

మద్యం ఎన్నో ఘటనలకు దారి తీస్తోంది. మద్యం మత్తులో హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. తాజాగా యూపీలో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. మద్యం తాగే సమయంలో సిగరేట్ ఇవ్వలేదని ఓ స్నేహితుడు, మరో స్నేహితుడిని హత్య చేశాడు.

A friend was killed for not giving him a cigarette to burn.. Incident in Agra
Author
First Published Oct 30, 2022, 12:09 PM IST

కాల్చేందుకు సిగరేట్ ఇవ్వలేదని ఓ స్నేహితుడు మరో స్నేహితుడిని హత్య చేశారు. ఈ ఘటన ఆగ్రాలో జరిగింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఉత్తరప్రదేశ్ లోని అగ్రా సిటీకి చెందిన కప్తాన్ సింగ్ (27), సుహైల్ ఖాన్‌ ఇద్దరు స్నేహితులు. ఎప్పుడూ కలిసే ఉండేవారు. ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్లేవారు. 

10 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు కేంద్రం పనిచేస్తోంది: ప్ర‌ధాని నరేంద్ర మోడీ

ఇద్దరూ కలిసి పలు సందర్భాల్లో మద్యం కూడా సేవించేవారు. సిగరేట్ తాగేవారు. ఎప్పటిలాగే శుక్రవారం కూడా ఇద్దరూ కలిసి మద్యం సేవించాలని నిర్ణయించుకున్నారు. దాని కోసం ఇద్దరూ కోట వద్దకు చేరుకున్నారు. ఆ గోడపై కూర్చొని తాగడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో సుహైల్ ఖాన్ కప్తాన్ సింగ్ ను సిగరేట్ అడిగాడు. దీనికి అతడు నిరాకరించాడు. ఈ సమయంలో వారిద్దరి మధ్య మాటమంతీ పెరిగింది. ఇది గొడవకు దారి తీసింది. దీంతో కోపంలో సుహైల్ ఖాన్ కప్తాన్ సింగ్ ను కోట మీది నుంచి తోసేశాడని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ నివేదించింది.

ఆ గోడ 30 అడుగుల ఎత్తు ఉంది. అంత ఎత్తు మీది నుంచి కింద పడిపోవడంతో బాధితుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో స్థానికులు కప్తాన్ సింగ్ ను గమనించి హాస్పిటల్ కు తరలించారు. ఈ సమయంలోనే బాధితుడు తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు. ఘటన జరిగిన తీరును వివరించాడు. అయితే చికిత్స పొందుతున్న సమయంలో పరిస్థితి విషమించడంతో అతడు చనిపోయాడు. 

భార్యకు తెలియకుండా రెండో పెళ్లికి సిద్ధమైన భర్త.. పెళ్లి పీటల మీద పెద్ద ట్విస్ట్.. ఏం జరిగిందంటే ?

దీనిపై బాధితుడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 304 కింద కేసు నమోదు చేసినట్లు ఆగ్రాలోని రాకబ్‌గంజ్ ఎస్‌హెచ్‌ఓ రాకేశ్ కుమార్ తెలిపారు. ఈ విచారణలో సుహైల్ ఖాన్ కూడా నేరాన్ని ఒప్పుకున్నాడు. మద్యం మత్తులో ఉన్న సమయంలో కప్తాన్ సింగ్ ను చాలా సార్లు సిగరేట్ అడిగానని, కానీ అతడు ఇవ్వలేదని చెప్పాడు. దీంతో అతడిని కోట మీది నుంచి నెట్టేశానని వెల్లడించాడని ఎస్ హెచ్ ఓ రాకేశ్ కుమార్ పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. ఈ వారం ప్రారంభంలో ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోల్ కూడా ఇలాంటి ఘటనే జరిగింది. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని తల్లిని ఓ కుమారుడు దారుణంగా హత్య చేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి. బిజ్నోర్ జిల్లా చాంద్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లేపురి గ్రామంలో సముద్రాదేవీని అనే 65 ఏళ్ల వృద్ధురాలు నివసిస్తున్నారు. ఆమెకు 25 ఏళ్ల దేవేంద్ర సైనీ అనే కుమారుడు ఉన్నాడు. గత కొంత కాలంగా అతడు మద్యానికి బానిస అయ్యాడు.

ఆరోగ్య సంర‌క్ష‌ణ‌, విద్య ప్ర‌భుత్వ బాధ్య‌త‌.. ప్ర‌యివేటీక‌ర‌ణ ఆపి.. ప్ర‌భుత్వం జోక్యం పెర‌గాలి: రాహుల్ గాంధీ

తాగి వచ్చి తరచూ కుటుంబ సభ్యులను వేధించేవాడు. గొడవలు చేసేవాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి సైనీ తన తల్లి వద్దకు వచ్చాడు. మద్యం కొనేందుకు తనకు డబ్బులు ఇవ్వాలని కోరాడు. దీంతో తల్లి మందలించింది. దీంతో కోపం తెచ్చుకున్న కుమారుడు ఆమెతో గొడవ పడ్డాడు. ఇలా గొడవ పడుతున్న సమయంలో క్షణికావేశంలో తల్లిని చెక్క కర్రతో తీవ్రంగా కొట్టాడు. దీంతో సముద్రాదేవి చనిపోయింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని హత్య కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడిని అరెస్టు చేశారు. అతడిపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేసినట్లు అదనపు పోలీసు సూపరింటెండెంట్ రామ్ అర్జ్ తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios