ఈనెల 13లోపు దిశ ఘటనపై మోదీ ఒక ప్రకటన ఇవ్వాలి: వైసీపీ ఎంపీ
హైదరాబాద్ ఘటనలో నిందితులకు వేసే శిక్ష విషయంలో మోదీ మంచి నిర్ణయం తీసుకుంటారని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు కోరుకుంటున్న కఠిన శిక్షలు వేసి దేశ చరిత్రలో సరికొత్త అధ్యయనానికి నాంది పలకాలన్నారు.
న్యూఢిల్లీ: శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ముగిసేలోపు నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో అన్న అంశంపై ప్రధాని నరేంద్రమోదీ సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు వైసీపీ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు.
తెలంగాణ రాష్ట్రంలో దిశ హత్య ఘటన చాలా విచారకరమన్నారు. ఇలాంటి ఘటనలతో భారతమాత తల్లడిల్లుతోందన్నారు. మహిళలపై దాడులు జరగకుండా ఉండాలంటే నిందితులకు తక్షణమే ఉరిశిక్ష వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రధాని నరేంద్రమోదీలాంటి గొప్ప వ్యక్తుల నేతృత్వంలో తాము పని చేస్తున్నట్లు తెలిపారు. మోదీ నాయకత్వంలో అందరికీ మంచి జరుగుతుందని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. దిశ హత్య కేసు విషయంలో కూడా మోదీ సరైన నిర్ణయం తీసుకుంటారని తాము ఆశిస్తున్నట్లు తెలిపారు.
హైదరాబాద్ ఘటనలో నిందితులకు వేసే శిక్ష విషయంలో మోదీ మంచి నిర్ణయం తీసుకుంటారని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు కోరుకుంటున్న కఠిన శిక్షలు వేసి దేశ చరిత్రలో సరికొత్త అధ్యయనానికి నాంది పలకాలన్నారు.
ఆలస్యం చేయోద్దు, వెంటనే ఉరితియ్యండి: రాజ్యసభలో ఏఐఏడీఎంకే ఎంపీ విజిల
ఇతర ఎంపీలు చెప్తున్నట్లు ఈనెల 31లోపు నిందితులకు కఠిన శిక్షలు వేయాలన్న డిమాండ్ సరైనది కాదన్నారు. ఈనెల 13లోపే నిందితులకు వేసే శిక్షలపైనా, అత్యాచారాలు హత్యలపైనా తీసుకునే చర్యలపై ప్రధాని మోదీ వివరణ ఇవ్వాలని రఘురామ కృష్ణంరాజు డిమాండ్ చేశారు.
ఇకపోతే బుధవారం సాయంత్రం దిశని నలుగురు నిందితులు అత్యంత దారుణంగా రేప్ చేసి హత్య చేశారు. తొడుపల్లి దగ్గర దిశ స్కూటీ పార్క్ చేయడం చూసిన లారీ డ్రైవర్ మహ్మాద్ పాషా ఉద్దేశపూర్వకంగా ఆమె స్కూటీ పంక్చర్ అయ్యిందని కుట్ర పన్నారు.
కేసులో ఏ3గా ఉన్న జొల్లు నవీన్ స్కూటీ బ్యాక్ టైర్ లో గాలి తీసేశారు. గచ్చిబౌలి నుంచి దిశ తొండుపల్లి వద్దకు రాగానే బ్యాక్ టైర్ పంక్చర్ అయ్యిందని నమ్మించారు. పంక్చర్ వేయిస్తామని చెప్పగానే ఆమె స్కూటీ ఇచ్చేసింది. పంక్చర్ వేయిస్తామని తీసుకెళ్లిన వారు గాలి కొట్టించి తిరిగి ఇచ్చేశారు.
అనంతరం ఆమెను కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. అత్యాచార సమయంలో యువతి కేకలు వేయడంతో నోరు మూయడంతో ఊపిరి ఆడక చనిపోయినట్లు పోలీసులు నిర్థారించారు. అనంతరం చటాన్ పల్లి బ్రిడ్జ్ దగ్గర కిరోసిన్ పోసి నిప్పంటించి దహనం చేశారు.
దిశ హత్య కేసులో పోలీసుల నిర్లక్ష్యం, డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు అభ్యంతరం: ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఇకపోతే హత్య కేసులో డ్రైవర్ ఏ1మహ్మద్ ఆరిఫ్, ఏ2 క్లీనర్ జొల్లు శివ (20), ఏ3 జొల్లు నవీన్ (23), ఏ4 క్లీనర్ చెన్న కేశవులు (లారీ డ్రైవర్)ను అరెస్ట్ చేసినట్లు సీపీ సజ్జనార్ మీడియాకు స్పష్టటం చేశారు. తెలిపారు. వైద్యురాలి హత్య కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు సీపీ సజ్జనార్ తెలిపారు.
ఇకపోతే నిందితులు ప్రస్తుతం చర్లపల్లి జైల్లో రిమాండ్ లో ఉన్నారు. ఇకపోతే తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాలతో కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును నియమించింది తెలంగాణ ప్రభుత్వం. వీలైనంత త్వరలో కేసు విచారణ పూర్తి చేసి నిందితులకు శిక్ష విధించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
ఆ నలుగురి నిందితులను ప్రజలకు అప్పగిస్తే తెలుస్తుంది: దిశ ఘటనపై జయాబచ్చన్