దిశ హత్య కేసులో పోలీసుల నిర్లక్ష్యం, డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు అభ్యంతరం: ఉత్తమ్ కుమార్ రెడ్డి

దిశ హత్య కేసు ఘటనపై తెలంగాణ ఉపముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి ముహమూద్ అలీ చేసిన వ్యాఖ్యలు అత్యంత బాధాకరమన్నారు. బాధితురాలు దిశ ఘటన జరుగుతున్న సమయంలో కుటుంబ సభ్యులకు కాకుండా డయల్ 100కు చేయాల్సింది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు. 

Justice for Disha: Tpcc chief Uttam kumar reddy serious comments in loksabha

న్యూఢిల్లీ: తెలంగాణలో అత్యంత దారుణంగా హత్యకు గురైన దిశ ఉదంతంపై లోక్ సభలో ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. దిశ హత్య కేసు ఘటనపై తెలంగాణ ఉపముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి ముహమూద్ అలీ చేసిన వ్యాఖ్యలు అత్యంత బాధాకరమన్నారు. 

బాధితురాలు దిశ ఘటన జరుగుతున్న సమయంలో కుటుంబ సభ్యులకు కాకుండా డయల్ 100కు చేయాల్సింది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు. ఈ ఘోరానికి ఆమె తప్పిదం కూడా కారణమేనంటూ అలీ చేయడం దురదృష్టకరమన్నారు. 

 

దిశ ఘటనపై తాను కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసినట్లు స్పష్టం చేశారు. దిశ హత్య ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం ఖచ్చితంగా కనబడుతుందన్నారు. తనకుమార్తె కనిపించడం లేదని బాధిత తల్లిదండ్రులు అర్ధరాత్రి రెండు పోలీస్ స్టేషన్లు తిరగాల్సిన దుస్థితి నెలకొందన్నారు. 

తమ పరిధిలోకి రాదంటూ పోలీసులు చెప్పడం సరికాదన్నారు. మరోక పోలీస్ స్టేషన్లో బాధిత కుటుంబ సభ్యులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆయన స్పష్టం చేశారు. బాధిత కుటుంబ సభ్యులపై పోలీసులు వ్యవహరించిన తీరు బాధాకరమన్నారు. పోలీసులు స్టేషన్ల చుట్టూ తిప్పుకున్న తర్వాతనే కేసు నమోదు చేసి చర్యలు ప్రారంభించారని తెలిపారు. 

ఆ నలుగురి నిందితులను ప్రజలకు అప్పగిస్తే తెలుస్తుంది: దిశ ఘటనపై జయాబచ్చన్

బాధిత కుటుంబ సభ్యులు వచ్చిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటే ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదన్నారు. దిశను అత్యంత దారుణంగా హత్య చేయడం చూస్తే అందర్నీ కలచివేస్తోందన్నారు. 

మద్యాన్ని విచ్చలవిడిగా అమ్ముతుండటంతో మద్యం మత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నట్లు ఆరోపించారు. భద్రత ఉన్న ప్రదేశంలో ఒక ప్రభుత్వ వైద్యురాలు హత్యకు గురవ్వడం ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. 

ప్రభుత్వం విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేపట్టిందని దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ పూర్తి చేసి నిందితులకు ఉరి శిక్ష వేయాల్సిందిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.   

ఇకపోతే బుధవారం సాయంత్రం దిశని నలుగురు నిందితులు అత్యంత దారుణంగా రేప్ చేసి హత్య చేశారు. తొడుపల్లి దగ్గర దిశ స్కూటీ పార్క్ చేయడం చూసిన లారీ డ్రైవర్ మహ్మాద్ పాషా ఉద్దేశపూర్వకంగా ఆమె స్కూటీ పంక్చర్ అయ్యిందని కుట్ర పన్నారు. 

కేసులో ఏ3గా ఉన్న జొల్లు నవీన్ స్కూటీ బ్యాక్ టైర్ లో గాలి తీసేశారు. గచ్చిబౌలి నుంచి దిశ తొండుపల్లి వద్దకు రాగానే బ్యాక్ టైర్ పంక్చర్ అయ్యిందని నమ్మించారు. పంక్చర్ వేయిస్తామని చెప్పగానే ఆమె స్కూటీ ఇచ్చేసింది. పంక్చర్ వేయిస్తామని తీసుకెళ్లిన వారు గాలి కొట్టించి తిరిగి ఇచ్చేశారు.

అనంతరం ఆమెను కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. అత్యాచార సమయంలో యువతి కేకలు వేయడంతో నోరు మూయడంతో ఊపిరి ఆడక చనిపోయినట్లు పోలీసులు నిర్థారించారు. అనంతరం చటాన్ పల్లి బ్రిడ్జ్ దగ్గర కిరోసిన్ పోసి నిప్పంటించి దహనం చేశారు. 

చర్లపల్లి జైల్లో దిశ హత్యకేసు నిందితులు: తొలి రోజే మటన్ తో భోజనం

ఇకపోతే హత్య కేసులో డ్రైవర్‌ ఏ1మహ్మద్ ఆరిఫ్, ఏ2 క్లీనర్‌ జొల్లు శివ (20), ఏ3 జొల్లు నవీన్‌ (23), ఏ4 క్లీనర్‌ చెన్న కేశవులు (లారీ డ్రైవర్‌)ను అరెస్ట్ చేసినట్లు సీపీ సజ్జనార్ మీడియాకు స్పష్టటం చేశారు. తెలిపారు. వైద్యురాలి హత్య కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు సీపీ సజ్జనార్‌ తెలిపారు. 

ఇకపోతే నిందితులు ప్రస్తుతం చర్లపల్లి జైల్లో రిమాండ్ లో ఉన్నారు. ఇకపోతే తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాలతో కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును నియమించింది తెలంగాణ ప్రభుత్వం. వీలైనంత త్వరలో కేసు విచారణ పూర్తి చేసి నిందితులకు శిక్ష విధించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. 

లోక్ సభలో దిశహత్యపై చర్చకు రేవంత్ పట్టు: స్పీకర్ ఓం బిర్లా విచారం

 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios