Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ వెటర్నిరీ డాక్టర్ రేప్, హత్య: రాజ్యసభలో ఏడ్చేసిన ఏఐఏడీఎంకే ఎంపీ విజిల

అత్యాచార కేసుల్లో న్యాయం ఆలస్యమయ్యే కొద్దీ నిరాకరించబడుతుందంటూ ఆమె అభిప్రాయపడ్డారు. అత్యాచార ఘటనల్లో సత్వరమే శిక్షలు పడేలా సవరణలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 
 

Justice for Disha:Justice delayed is justice denied says aiadmk mp vijila satyanath
Author
New Delhi, First Published Dec 2, 2019, 12:52 PM IST | Last Updated Dec 2, 2019, 1:43 PM IST

న్యూఢిల్లీ: దిశ హత్య కేసులో నిందితులకు ఉరి శిక్షే సరైన శిక్ష అని స్పష్టం చఏశారు ఏఐఏడీఎంకే ఎంపీ విజిల సత్యనాథ్. రాజ్యసభలో దిశ హత్య ఘటనపై జరిగిన చర్చలో మాట్లాడిన ఆమె నలుగురు నిందితులను వెంటనే ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు. 

తక్షణమే ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి నిందితులకు కఠిన శిక్షలు వేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 31లోపు ఆ నలుగురి నిందితులను ఉరితీయాలని డిమాండ్ చేశారు విజిల సత్యనాథ్.  

 

అత్యాచార కేసుల్లో న్యాయం ఆలస్యమయ్యే కొద్దీ నిరాకరించబడుతుందంటూ ఆమె అభిప్రాయపడ్డారు. అత్యాచార ఘటనల్లో సత్వరమే శిక్షలు పడేలా సవరణలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 

దేశంలో బాలికల దగ్గర నుంచి వృద్ధాప్య మహిళ వరకు ఎవరికీ రక్షణ లేకుండా పోయిందన్నారు. బాలిక లేదా మహిళ బయటకు వెళ్తే తిరిగి ఇంటికి వచ్చే వరకు ప్రతీ కుటుంబంలో ఆందోళన నెలకొందన్నారు. ఇలాంటి ఆందోళనలకు ఫుల్ స్టాప్ పడాలంటే నిందితులకు ఉరిశిక్ష వేయాల్సిందేనని ఎంపీ విజిల సత్యనాథ్ డిమాండ్ చేశారు. 

దిశ హత్య కేసులో పోలీసుల నిర్లక్ష్యం, డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు అభ్యంతరం: ఉత్తమ్ కుమార్ రెడ్డి

 ఇకపోతే బుధవారం సాయంత్రం దిశని నలుగురు నిందితులు అత్యంత దారుణంగా రేప్ చేసి హత్య చేశారు. తొడుపల్లి దగ్గర దిశ స్కూటీ పార్క్ చేయడం చూసిన లారీ డ్రైవర్ మహ్మాద్ పాషా ఉద్దేశపూర్వకంగా ఆమె స్కూటీ పంక్చర్ అయ్యిందని కుట్ర పన్నారు. 

కేసులో ఏ3గా ఉన్న జొల్లు నవీన్ స్కూటీ బ్యాక్ టైర్ లో గాలి తీసేశారు. గచ్చిబౌలి నుంచి దిశ తొండుపల్లి వద్దకు రాగానే బ్యాక్ టైర్ పంక్చర్ అయ్యిందని నమ్మించారు. పంక్చర్ వేయిస్తామని చెప్పగానే ఆమె స్కూటీ ఇచ్చేసింది. పంక్చర్ వేయిస్తామని తీసుకెళ్లిన వారు గాలి కొట్టించి తిరిగి ఇచ్చేశారు.

అనంతరం ఆమెను కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. అత్యాచార సమయంలో యువతి కేకలు వేయడంతో నోరు మూయడంతో ఊపిరి ఆడక చనిపోయినట్లు పోలీసులు నిర్థారించారు. అనంతరం చటాన్ పల్లి బ్రిడ్జ్ దగ్గర కిరోసిన్ పోసి నిప్పంటించి దహనం చేశారు. 

చర్లపల్లి జైల్లో దిశ హత్యకేసు నిందితులు: తొలి రోజే మటన్ తో భోజనం

ఇకపోతే హత్య కేసులో డ్రైవర్‌ ఏ1మహ్మద్ ఆరిఫ్, ఏ2 క్లీనర్‌ జొల్లు శివ (20), ఏ3 జొల్లు నవీన్‌ (23), ఏ4 క్లీనర్‌ చెన్న కేశవులు (లారీ డ్రైవర్‌)ను అరెస్ట్ చేసినట్లు సీపీ సజ్జనార్ మీడియాకు స్పష్టటం చేశారు. తెలిపారు. వైద్యురాలి హత్య కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు సీపీ సజ్జనార్‌ తెలిపారు. 

ఇకపోతే నిందితులు ప్రస్తుతం చర్లపల్లి జైల్లో రిమాండ్ లో ఉన్నారు. ఇకపోతే తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాలతో కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును నియమించింది తెలంగాణ ప్రభుత్వం. వీలైనంత త్వరలో కేసు విచారణ పూర్తి చేసి నిందితులకు శిక్ష విధించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. 

రాజ్యసభలో దిశ ఘటనపై చర్చ: 31లోగా ఉరితియ్యాలని డిమాండ్

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios