న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్న దిశ హత్య ఘటనపై రాజ్యసభ సభ్యురాలు, అమితాబ్ బచ్చన్ సతీమణి జయాబచ్చన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దిశహత్య ఘటన తనను కలచివేసింవదని ఆవేదన వ్యక్తం చేశారు. 

దిశపై దారుణానికి ఒడిగట్టిన నలుగురు నిందితులను ఉపేక్షించకూడదని ఆమె డిమాండ్ చేశారు. నలుగురు నిందితుల వల్ల ప్రపంచంలో భారతీయులంతా తలదించుకోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆమె అభిప్రాయపడ్డారు. 

లోక్ సభలో దిశహత్యపై చర్చకు రేవంత్ పట్టు: స్పీకర్ ఓం బిర్లా విచారం

మహిళలపై దారుణాలకు ఒడిగట్టితే అలాంటి వారికి ఇతర దేశాల్లో ప్రజలే తగిన శిక్ష వేస్తున్నారని ఆమె గుర్తు చేశారు. దిశ హత్య కేసు ఘటనలో నిందితులను సైతం ప్రజలకే అప్పగించాలని ఆమె డిమాండ్ చేశారు. 

ఇతర దేశాల్లో ఎలాగైతే నిందితులను ప్రజలే శిక్షిస్తున్నారో అలాగే దిశ హత్య కేసు నిందితులను కూడా ప్రజలే శిక్షిస్తారన్నారు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం ఏం సమాధానం చెప్తోందని నిలదీశారు జయాబచ్చన్. 

న్యూఢిల్లీలో నిర్భయ ఘటన, తెలంగాణలో దిశ ఘటన, ఇటీవలే కథువా ఘటన ఇలా వరుసపెట్టి మహిళలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదని జయాబచ్చన్ నిలదీశారు. 

దిశఘటన నిందితుల విషయంలో తాను కాస్త కఠినంగా రాజ్యసభలో మాట్లాడి ఉండొచ్చని కానీ అది తన ఆవేదన మాత్రమేనని జయాబచ్చన్ స్పష్టం చేశారు. నిందితులను ప్రజలకు అప్పగిస్తేనే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని జయాబచ్చన్ స్పష్టం చేశారు. 

రాజ్యసభలో దిశ ఘటనపై చర్చ: 31లోగా ఉరితియ్యాలని డిమాండ్...