Asianet News TeluguAsianet News Telugu

జమ్మూ కాశ్మీర్ లో జాయింట్ యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్.. నలుగురు ఉగ్రవాదులు హతం..

జమ్మూకాశ్మీర్ లోని రెండు ప్రాంతాల్లో మంగళవారం జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు ఉగ్రవాదులు చనిపోయారు. అనంత్‌నాగ్, అవంతిపోరా జిల్లాల్లో ఈ కాల్పులు జరిగాయి. 

Joint anti-terrorist operation in Jammu and Kashmir.. Four terrorists killed..
Author
First Published Nov 1, 2022, 11:14 PM IST

దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్, అవంతిపోరా జిల్లాల్లో జరిగిన జాయింట్ యాంటీ-టెర్రరిస్ట్ ఆపరేషన్లలో నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు, పోలీసులు మట్టుబెట్టారు. దీంతో పాటు శ్రీనగర్‌లో పోలీసులు నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు హైబ్రిడ్ ఉగ్రవాదులను అరెస్టు చేశారు. వారు చెప్పిన వివరాల ఆధారంగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అవంతిపోరా ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు, బిజ్‌బెహరా ప్రాంతంలో ఒక ఉగ్రవాది హతం అయ్యారని పోలీసులు తెలిపారు.

Bharat Jodo Yatra: చార్మినార్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన రాహుల్ గాంధీ

వివరాల ఇలా ఉన్నాయి. అనంత్‌నాగ్‌లోని సేమ్‌థాన్ బిజ్‌బెహరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారని సమాచారం రావడంతో ఆర్మీ (3వ ఆర్ ఆర్)తో పాటు పోలీసులు కార్డన్, సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. భద్రతా బలగాలు అనుమానాస్పద ప్రదేశం వైపు వెళుతుండగా.. దాక్కున్న ఉగ్రవాది జాయింట్ సెర్చ్ పార్టీపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. దీనికి  భద్రతా బలగాలు ధీటుగా బదులిచ్చాయి. వారి చర్యలను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రతీకారం తీర్చుకున్నాయి.

మోర్బీ లో కుప్పకూలిన బ్రిడ్జి: క్షతగాత్రులను పరామర్శించిన మోడీ(ఫోటోలు)

ఆ తర్వాత జరిగిన ఎన్‌కౌంటర్‌లో లాడర్‌ముడ్‌లో నివాసం ఉంటున్న హబీబుల్లా కుమారుడు షకీర్ అహ్మద్ అనే స్థానిక ఉగ్రవాది హతమయ్యాడు. పోలీసు రికార్డుల ప్రకారం హతమైన ఉగ్రవాదికి నిషేధిత ఉగ్రవాద సంస్థ హెచ్‌ఎంతో సంబంధాలు ఉన్నాయి. అతడు భద్రతా బలగాలపై దాడులతో పాటు అనేక ఉగ్రవాద నేర కేసుల్లో పాల్గొన్నారు.

UCC: యూసీసీని అమలు చేసే ఉద్దేశం బీజేపీకి లేదు: అరవింద్ కేజ్రీవాల్

ఈ ఎన్ కౌటర్ పై కాశ్మీర్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) విజయ్ కుమార్ మాట్లాడుతూ.. అవంతిపోరాలో చనిపోయిన ముగ్గురు ఉగ్రవాదులలో ఒకరు లష్కరో తోయిబా కు చెందిన కమాండర్ ముఖ్తార్ భట్ ఉన్నారని తెలిపారు. అతడు విదేశీ టెర్రరిస్ట్‌తో కలిసి భద్రతా దళాల శిబిరంపై ఫిదాయీన్ దాడికి వెళ్లేందుకు ప్లాన్ చేశారని వెల్లడించారు. అక్కడి నుంచి ఏకే-74, రైఫిల్, ఒక ఏకే-56 రైఫిల్, 1 పిస్టల్ స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. అవంతిపోరా పోలీసులు, ఇండియన్ ఆర్మీ ఒక పెద్ద తీవ్రవాద ఘటనను జరగకుండా నివారించాయని చెప్పారు.

ఈ ఎన్ కౌంటర్ భద్రతా బలగాల పెద్ద విజయం అని ఆయన పేర్కొన్నారు.  కాగా.. అక్టోబర్ 26వ తేదీన జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ప్రారంభమైన యాంటీ టెర్రర్ ఆపరేషన్‌లో ఒక ఆర్మీ జవాన్ మరణించారు. అలాగే లష్కరే తోయిబాకు చెందిన స్థానిక ఉగ్రవాదిని అరెస్టు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios