జమ్మూ కాశ్మీర్ లోని ఉధంపూర్ లో ఓ విషాద ఘటన జరిగింది. ఓ సైనికుడు ఒత్తిడికి లోనై ముగ్గురు జావాన్లను తుపాకీతో కాల్చాడు. అనంతరం ఆ జవాన్ కూడా గన్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
జమ్మూ కాశ్మీర్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ ఐటీబీపీ జవాన్ తన తోటి జవాన్లను INSAS రైఫిల్‌తో కాల్చాడు. దీంతో వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. అనంతరం అతడూ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఉధంపూర్ లో జరిగింది.
ఐదుగురు గోవా ఎమ్మెల్యేలను చెన్నైకి తరలించిన కాంగ్రెస్.. రాష్ట్రపతి ఎన్నికల వేళ నిర్ణయం
వివరాలు ఇలా ఉన్నాయి.. ఉత్తరాఖండ్ కు చెందిన భూపీందర్ ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) లో జవాన్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అమర్‌నాథ్ యాత్ర విధుల కోసం ఉదంపూర్ పట్టణానికి వెళ్లిన ITBP బృందంలో ఆయన కూడా ఉన్నారు. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ ఆ జవాన్ తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు.
Corona Vaccination: 200 కోట్ల మైలురాయికి చేరువలో కరోనా వ్యాక్సినేషన్
విధుల్లో భాగంగా శనివారం కమ్యూనిటీ సెంటర్ కు బయట ఉన్నాడు. అయితే ఆ సమయంలో INSAS రైఫిల్ తో కాల్పులు జరపడం ప్రారంభించాడు. తన తోటి ఉద్యోగులు (జవాన్ లు)ను కాల్చాడు. దీంతో వారికి తీవ్ర గాయాలు అయ్యాయని ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ నివేదించింది. అనంతరం లోపలికి పారిపోయి తన తుపాకీతో తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారం. గాయపడిన జవాన్లను హాస్పిటల్ లకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. గడిచిన 24 గంటల్లో ఇది రెండో ఘటన. ఇలాంటి ఘటన శుక్రవారం పూంచ్ ప్రాంతంలో జరిగింది. ఓ శిబిరంలో ఉన్న ఇద్దరు సైనికుల్లో ఇద్దరు ఘర్షణకు దిగారు. ఈ గొడవల్లో ఇద్దరు TA జవాన్లు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు.
ఇంటిని వెతుకుతూ 75 ఏళ్ల తర్వాత మళ్లీ పాకిస్తాన్ వెళ్లిన భారత మహిళ.. ‘ఆ జ్ఞాపకాలు శాశ్వతం’
ఈ ఘటన విషయం తెలుసుకున్న స్థానిక ఏఎస్పీ అన్వర్ ఉల్ హక్ కాల్పులు జరిగిన ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని సమీక్షించారు. నిందితుడు జవాన్ వద్ద ఉన్న సర్వీస్ రైఫిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణ ప్రకారం, భూపేంద్ర సింగ్ దాదాపు 15 బుల్లెట్లను కాల్చాడు. కాల్పుల్లో గాయపడిన వారిని దల్ రామ్, అఖ్లాల్ మాలిక్, గోరా రజనీకాంత్ గా గుర్తించారు. అయితే ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.
