టీకా పంపిణీ కీలక మైలురాయిని చేరుకోనుంది. 200 డోసుల పంపిణీ చేసిన రికార్డును సొంతం చేసుకోబోతున్నది. శనివారం నాటికి దేశంలో మొత్తం 199.71 కోట్ల డోసులు పంపిణీ చేశారు.  

న్యూఢిల్లీ: కరోనా టీకా పంపిణీ కీలక మైలు రాయికి చేరువలో ఉన్నది. 200 కోట్ల డోసుల పంపిణీకి చేరువలో టీకా పంపిణీ ఉన్నది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వం కింద చరిత్ర సృష్టించామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా ట్వీట్ చేశారు.

శనివారం ఉదయే 200 కోట్ల డోసుల పంపిణీకి కౌంట్ డౌన్ మొదలయింది. శనివారం నాటికి మన దేశంలో మొత్తం 199.71 కోట్ల డోసులను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 

12 నుంచి 14 ఏళ్ల వయసు పిల్లలకు తొలి డోసుగా సుమారు 3.79 కోట్ల డోసుల పంపిణీ జరిగింది. కాగా, కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందించిన డోసుల సంఖ్య సుమారు 193.53 కోట్లుగా ఆరోగ్య శాఖ చెబుతున్నది. 

ఆజాదీ కా అమృత్ మహోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శుక్రవారం నుంచి 75 రోజుల పాటు బూస్టర్ డోసును ఉచితంగా ఇచ్చే ఆఫర్ ప్రకటించింది. డోర్ టు డోర్ సర్వీసెస్ వంటి ఇతర ప్రత్యేక క్యాంపులు నిర్వహించనుంది.

18 నుంచి 59 ఏళ్ల వారికి 13.3 లక్షల ప్రికాషన్ డోసులు వేశారు. శుక్రవారం రాత్రి 10 గంటలకు ఈ లెక్క. 

2021, జనవరి 16న మన దేశంలో టీకా పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. 2021 ఫిబ్రవరి 2వ తేదీన ఫ్రంట్ లైన్ వర్కర్లకు టీకా పంపిణీ ప్రారంభమైంది. మార్చి 1వ తేదీన మరో దశ టీకా పంపిణీ మొదలైంది. కాగా, ఏప్రిల్ 1వ తేదీ నుంచి 45 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా పంపిణీ చేసింది. మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాకు అర్హులుగా ప్రకటించి అమలు చేసింది.