ఇజ్రాయెల్-పాలస్తీనా సంక్షోభంతో భారత్ కు ఇంధన సమస్య ? పెట్రోలియం శాఖ మంత్రి ఏమన్నారంటే ?
ఇజ్రాయెల్ - పాలస్తీనాల మధ్య జరుగుతున్న యుద్ధం మన దేశంలో ఇంధన సమస్యలకు దారి తీయవచ్చని పరిశ్రమ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇతర దేశాల ఘర్షణ వల్ల ఇందన ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. అయితే ఇందన సమస్య ఏర్పడుతుందనే వాదనపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి స్పందించారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే ?

ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య వివాదం వల్ల తీవ్ర ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరుగుతోంది. రెండు దేశాల సైనికులు భీకరంగా పోరాడుతున్నారు. దీంతో రెండు వైపులా ప్రాణనష్టం సంభవిస్తోంది. అనేక భవనాలు కూడా బాంబుల దాడితో నేలమట్టం అవుతున్నాయి. అయితే ప్రపంచ దేశాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎందుకంటే రష్యా-ఉక్రెయిన్ జరుగుతున్న యుద్ధం అనేక దేశాలపై ప్రభావం చూపించింది.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కుల గణన చేపడుతాం.. తర్వాత ఆర్థిక గణన కూడా.. - రాహుల్ గాంధీ
తాజా యుద్ధం ప్రభావం మన దేశంలో ఇంధన సమస్యను సృష్టిస్తుందని పలు వాదనలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పందించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య యుద్ధం భారత్ కు ఇందన సమస్యను తీసుకురాదని స్పష్టం చేశారు. అయితే అక్కడి పరిస్థితిని భారత్ నిశితంగా పరిశీలిస్తోందని చెప్పారు. ఇలాంటి పరిస్థితులు స్వచ్ఛమైన ఇంధన వినియోగాన్ని ఎంచుకోవడానికి దేశాలను ప్రోత్సహిస్తాయని మంత్రి హెచ్చరించారు.
బాలాసోర్ రైలు ప్రమాదం : ఇంకా భువనేశ్వర్ ఎయిమ్స్ లోనే 28 మృతదేహాలు.. రేపు అంత్యక్రియలు..
‘‘ఇజ్రాయెల్-పాలస్తీనా ఘర్షణ జరుగుతున్న ప్రదేశం అనేక విషయాలలో ప్రపంచ శక్తికి కేంద్రంగా ఉంది. మేము అన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాం. ఇప్పటికైతే ఎలాంటి సమస్యా లేదు. కానీ ఈ రకమైన అనిశ్చితులు స్థిరమైన, స్వచ్ఛమైన ఇంధన వినియోగం వైపు మారడానికి ప్రోత్సహిస్తాయని మాత్రమే నేను చెబుతున్నాను’’ అని అన్నారు. సోమవారం (అక్టోబర్ 9) ఎనర్జీ టెక్నాలజీ మీట్ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ లో నెలకొన్న పరిణామాలను భారత్ నిశితంగా పరిశీలిస్తోందని పేర్కొన్నారు. దేశం పరిణితితో పరిస్థితిని ఎదుర్కొంటుందని ఆయన పేర్కొన్నారు.
కుర్చీలతో చితక్కొట్టుకున్న కబడ్డీ జట్లు.. ఐఐటీ కాన్పూర్ లో ఘటన.. వీడియో వైరల్
ఇదిలావుండగా.. ప్రపంచ చమురు సరఫరాలో మూడింట ఒక వంతును మిడిల్ ఈస్ట్ ప్రాంతం ఉత్పత్తి చేస్తోంది. ఈ ఘర్షణ వ్యాపిస్తే సరఫరాలకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని పరిశ్రమ విశ్లేషకులు భావిస్తున్నారని ‘ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్’ నివేదించింది. ప్రస్తుతం యుద్ధం జరుగుతున్న ప్రాంతాలు చమురు ఉత్పత్తి చేయనప్పటికీ.. ఈ ఘర్షణ చమురుపై భౌగోళిక భౌగోళిక ప్రమాద ప్రీమియంలను పెంచుతాయని, ఫలితంగా చమురు ధరలు పెరుగుతాయని ఇక్రా వైస్ ప్రెసిడెంట్, కో-హెడ్ ప్రశాంత్ వశిష్ట్ అభిప్రాయపడ్డారు. ఈ ఘర్షణ వ్యాప్తిస్తే సరఫరాలకు ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. ఎందుకంటే మధ్యప్రాచ్య ప్రాంతం ప్రపంచ సరఫరాలలో మూడింట ఒక వంతు ఉత్పత్తి చేస్తోందని చెప్పారు. హోర్ముజ్ జలసంధి ప్రభావితమైతే ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం ప్రభావితమవుతుందని చెప్పారు.