బాలాసోర్ రైలు ప్రమాదం : ఇంకా భువనేశ్వర్ ఎయిమ్స్ లోనే 28 మృతదేహాలు.. రేపు అంత్యక్రియలు..
ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం దేశాన్ని విషాదంలోకి నెట్టేసింది. ఈ ప్రమాదంలో 297 మంది మరణించారు. అయితే అందులో 28 మంది మృతదేహాలు ఇంకా భువనేశ్వర్ లోని ఎయిమ్స్ లోనే ఉన్నాయి. వాటిని ఎవరూ క్లెయిమ్ చేసుకోకపోవడంతో రేపు అధికారులు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగి నాలుగు నెలలు అవుతోంది. ఈ ప్రమాదం వల్ల 297 ప్రాణాలు కోల్పోయారు. అయితే అందులో చాలా వరకు మృతదేహాలను వారి కుటుంబీకులు తీసుకెళ్లారు. వారి సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. కానీ ఇప్పటికే భువనేశ్వర్ ఎయిమ్స్ లో ఎవరూ క్లెయిమ్ చేయని 28 మృతదేహాలు ఉన్నాయి.
కుర్చీలతో చితక్కొట్టుకున్న కబడ్డీ జట్లు.. ఐఐటీ కాన్పూర్ లో ఘటన.. వీడియో వైరల్
వాటిని తీసుకెళ్లేందుకు సంబంధీకులు ఎవరూ రాకపోవడంతో భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కీలక నిర్ణయం తీసుకుంది. సరైన హక్కుదారులు దొరకని 28 మంది అవశేషాలను శాస్త్రీయంగా నిర్మూలించేందుకు నగరపాలక సంస్థ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ను జారీ చేసింది. ఈ విషయాన్ని బీఎంసీ మేయర్ సులోచనా దాస్ సోమవారం మీడియాకు తెలిపారు. క్లైయిమ్ చేయని మృతదేహాలను సీబీఐ అధికారుల సమక్షంలో కార్పొరేషన్ కు అప్పగిస్తామని చెప్పారు. మంగళవారం అంత్యక్రియలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు.
రైలు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. మృతదేహాలను శాస్త్రీయ పద్ధతిలో నిర్మూలించాలని కోరుతూ ఖుర్దా జిల్లా కలెక్టర్ కు లేఖ రాసింది. దీంతో బీఎంసీ ఈ చర్యకు పూనుకుందని ‘ఇండియా టీవీ’ నివేదించింది. ఆ మృతదేహాలను ఎయిమ్స్ నుంచి నగరంలోని సత్యనగర్, భరత్ పూర్ లోని శ్మశానవాటికలకు సజావుగా తరలించేందుకు బీఎంసీ ఏర్పాట్లు చేస్తోందని నివేదించింది. కాగా.. రాష్ట్ర, కేంద్ర, జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రస్తుత నియమాలు, మార్గదర్శకాలను అనుసరించి ఈ మృతదేహాలకు దహన సంస్కారాలను నిర్వహించనున్నారు. బీఎంసీ జారీ చేసిన ఎస్ఓపీ ప్రకారం ఈ మొత్తం ప్రక్రియను వీడియో తీయనున్నారు.
హమాస్ పై పోరులో ఇజ్రాయెల్ మాజీ ప్రధాని సైతం.. సైనికులతో కలిసి రంగంలోకి నఫ్తాలీ బెన్నెట్
ఈ ఏడాది జూన్ 2న రాత్రి 7 గంటల సమయంలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఒడిశాలోని బహనాగ బజార్ స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొనడంతో బోగీలు పట్టాలు తప్పాయి. కోరమాండల్ ఎక్స్ ప్రెస్ కు చెందిన కొన్ని బోగీలు అదే సమయంలో వెళ్తున్న బెంగళూరు-హౌరా ఎక్స్ ప్రెస్ లోని చివరి కొన్ని బోగీలను ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మొత్తంగా 297 మంది చనిపోయారు. అయితే ఇందులో ఎయిమ్స్ భువనేశ్వర్ 162 మృతదేహాలను స్వీకరించింది. వాటిలో 81 మృతదేహాలను మొదటి దశలో మృతుల కుటుంబ సభ్యులకు అప్పగించారు. డీఎన్ఏ పరీక్షల అనంతరం మరో 53 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. మరో 28 మృతదేహాలను ఎవరూ క్లెయిమ్ చేసుకోలేదు. ఇక అప్పటి నుంచి పారాదీప్ పోర్ట్ ట్రస్ట్ నుంచి సేకరించిన ఐదు డీప్ ఫ్రీజర్ కంటైనర్లలో వాటిని భద్రపరిచారు.