Asianet News TeluguAsianet News Telugu

కుర్చీలతో చితక్కొట్టుకున్న కబడ్డీ జట్లు.. ఐఐటీ కాన్పూర్ లో ఘటన.. వీడియో వైరల్

కాన్పూర్ ఐఐటీలో జరిగిన వార్షిక క్రీడా కార్యక్రమంలో రెండు కబడ్డీ జట్ల ఆటగాళ్ల మధ్య హింసాత్మక ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు జట్లలో ఉన్న విద్యార్థులు కుర్చీలతో దారుణంగా కొట్టుకున్నారు.

Kabaddi teams crushed with chairs.. Incident in IIT Kanpur.. Video viral..ISR
Author
First Published Oct 9, 2023, 2:02 PM IST | Last Updated Oct 9, 2023, 2:13 PM IST

ఐఐటీ కాన్పూర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆ క్యాంపస్ లో శనివారం విద్యార్థులకు కబడ్డీ పోటీలు నిర్వహించారు. విద్యార్థులు వైఎంసీఏ-ఎన్‌ఎస్‌యూటీ అనే రెండు జట్లుగా ఏర్పడి పోటీలో పాల్గొన్నారు. అయితే వారి మధ్య ఏం జరిగిందో ఏమో గానీ రెండు గ్రూపులు భీకరంగా ఘర్షణ పట్టారు. 

అక్కడున్న కుర్చీలను తీసుకొని కొట్టుకున్నారు. ఒకరుపై ఒకరు పడి తన్నుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను పలువురు రికార్డు చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. అది ఇప్పుడు వైరల్ గా మారింది. ఐఐటీ కాన్పూర్ లో వార్షిక క్రీడా కార్యక్రమం సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఇరు జట్లు జట్లు కాన్పూర్ వెలుపల నుంచి వచ్చినవేనని ‘ఇండియా టూడే’ పేర్కొంది. ప్రస్తుతం ఇరు జట్లు పోటీ నుంచి వైదొలిగాయని తెలుస్తోంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios