Asianet News TeluguAsianet News Telugu

జాతీయ గీతానికి అవమానం.. సిగరెట్ తాగుతూ, వెకిలిగా నవ్వుతూ గీతాలాపన.. వీడియో వైరల్.. నెటిజన్ల మండిపాటు

ఇద్దరు అమ్మాయిలు జాతీయ గీతాన్ని అవమానించారు. చేతిలో సిగరెట్లు పట్టుకొని, వెకిలిగా నవ్వుతూ జాతీయ గీతాన్ని ఆలపించారు. దానిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. దీనిపై నెటిజన్ల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Insult to National Anthem.. Smoking cigarette and smiling while singing the song.. Video viral.. Netizens are furious..ISR
Author
First Published Apr 11, 2023, 3:39 PM IST

దేశ ప్రజలు ఎంతో గౌరవించే జాతీయ గీతానికి అవమానం జరిగింది. కలకత్తాకు చెందిన ఇద్దరు అమ్మాయిలు సిగరెట్లు తాగుతూ, వెక్కిలిగా నవ్వుతూ భారత జాతీయ గీతాన్ని అపహాస్యం చేస్తూ గీతాలాపన చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. ఆ యువతులపై నెటిజన్లు మండిపడుతున్నారు. కలకత్తా హైకోర్టు న్యాయవాదితో పాటు పలువురు నెటిజన్లు అమ్మాయిలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మధ్యప్రదేశ్ లో నర్మదా నదిపై నడిచిన మహిళ.. దేవత అంటూ పూజించిన ప్రజలు.. వీడియో వైరల్

ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసినందుకు బరాక్ పూర్ సైబర్ సెల్ పోలీసు స్టేషన్ లో ఆ అమ్మాయిలపై ఫిర్యాదు నమోదు అయ్యింది. అయితే వెంటనే ఆ యువతులు వీడియోను డిలీట్ చేశారు. తాము సరదా కోసమే చేశామని చెప్పారు. 

రాజ్యాంగ పరిరక్షణ కోసం భావసారూప్యత కలిగిన పార్టీలతో కాంగ్రెస్ చేతులు కలుపుతుంది - సోనియా గాంధీ

కాగా.. దీనిపై ఇప్పటికే దర్యాప్తు ప్రారంభమైంది. ఫేస్ బుక్ లేదా మరేదైనా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో వైరల్ అయిన ఈ పోస్టుకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. ఈ దర్యాప్తు అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని బారక్ పూర్ పోలీస్ కమిషనర్ అలోక్ రాజోరియా ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’కు తెలిపారు. అయితే బాలికలు మేజర్లా లేక మైనర్లా అనే విషయం ఇంకా నిర్ధారణ కాలేదు. వారిద్దరూ ఇప్పుడు పదకొండో తరగతి చదువుతున్నారని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి.

ఈ వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు..
ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ గీతాన్ని అవమానించడం సరైంది కాదని కామెంట్లు చేస్తున్నారు. కాగా.. ఈ వీడియోను బీజేపీ ప్రధాన కార్యదర్శి అనుపమ్ భట్టాచార్య ట్విటర్ లో షేర్ చేస్తూ అమ్మాయిల ఆచూకీ తెలియజేయాలని కోరారు. 

ఏప్రిల్ 30న సల్మాన్ ఖాన్ ను చంపేస్తా- బాలీవుడ్ కండల వీరుడికి మళ్లీ హత్యా బెదిరింపులు..ఈ సారి ‘రాఖీ భాయ్’ నుంచి

జాతీయ గీతం ఆలపించేటప్పుడు పాటించాల్సిన రూల్స్ ఏంటి ? 
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఐదవ భాగంలోని భారత జాతీయ గీతానికి సంబంధించిన ఉత్తర్వుల ప్రకారం.. జాతీయ గీతాన్ని ఆలపించినప్పుడల్లా ప్రజలంతా శ్రద్ధతో నిలబడాలని పేర్కొంది. జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక చట్టం- 1971 ప్రకారం జాతీయ పతాకాన్ని లేదా జాతీయ గీతాన్ని గౌరవించే నిబంధనలను పౌరులు ఉల్లంఘిస్తే 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా కొన్ని సార్లు రెండూ విధించే అవకాశం ఉంటుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios