అమానవీయం.. గిరిజనుడి చెవిలో మూత్ర విసర్జన..యూపీలో ఘటన, నిందితుల అరెస్టు
యూపీలో ఓ అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఉన్నతవర్గానికి చెందిన ఓ వ్యక్తి తాగిన మత్తులో గిరిజనుడి చెవిలో మూత్ర విసర్జన చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.
మధ్యప్రదేశ్ లో గిరిజనుడిపై జరిగిన మూత్ర విసర్జన ఘటన మరువక ముందే యూపీలోనూ అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. సోన్ భద్రలో ఓ ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తి గిరిజనుడి చెవిలో మూత్రం పోశాడు. ఈ ఘటన జూలై 11వ తేదీన జరగ్గా.. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ముగిసిన ప్రధాని మోడీ ప్రాన్స్ పర్యటన.. ఫ్రెంచ్-ఇండియా స్నేహం చిరకాలం కొనసాగుతుందంటూ మాక్రాన్ ట్వీట్
వివరాలు ఇలా ఉన్నాయి. జుగైల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘటిహతా తోలా కుస్పురావా గ్రామంలో జూలై 11వ తేదీన రాత్రి ఉన్నతవర్గానికి చెందిన జవహీర్ పటేల్, గిరిజనుడైన గులాబ్‌కోర్ కలిసి మద్యం సేవించారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. ఇది తీవ్ర వాగ్వాదానికి దారి తీసింది. దీంతో కోపంతో జవహీర్ పటేల్, గులాబ్ కోర్ చెవిలో మూత్ర విసర్జన చేశాడు. దీనిని పలువురు వీడియో తీశాడు.
హిమాచల్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. వాహనం లోయలో పడి ఐదుగురు మృతి, నలుగురికి గాయాలు
బాధితుడు కూడా తాగిన మత్తులో ఉండటం వల్ల ఆ రాత్రి జరిగిన విషయాన్ని అతడు మర్చిపోయాడు. అయితే ఆ వీడియోను పలువురు సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో అది వైరల్ అయ్యింది. ఆ వీడియో చూసుకున్న గులాబ్ కోర్ తనకు జరిగిన అవమానాన్ని గుర్తు తెచ్చకున్నాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడిపై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని కోరారు.
జమ్మూకాశ్మీర్ లో దారుణం.. ముగ్గురు వలస కార్మికులను హతమార్చిన ఉగ్రవాదులు..
వైరల్ అయిన ఈ వీడియో పోలీసు ఉన్నతాధికారుల వద్దకు చేరింది. దీంతో సోన్ భద్ర పోలీసు సూపరింటెండెంట్ యశ్ వీర్ సింగ్ గ్రామానికి చేరుకుని బాధితురాడిని పరామర్శించారు. ఆయన వెంట పోలీసులు బృందంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపింది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జవహర్ పటేల్, అతని సహచరుడితో సహా ఇద్దరిపై ఐపీసీ సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం వారిద్దరిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు చెప్పారు.