జమ్మూకాశ్మీర్ లో దారుణం.. ముగ్గురు వలస కార్మికులను హతమార్చిన ఉగ్రవాదులు..
జమ్మూ కాశ్మీర్ లో దారుణం జరిగింది. బతుకుదెరువు కోసం షోపియాన్ జిల్లాకు వలస వచ్చిన బీహార్ కు చెందిన ముగ్గురు కార్మికులను ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ కాల్పుల్లో మరో ముగ్గురికి కూడా గాయాలు అయ్యాయి.
జమ్ముకాశ్మీర్ లోని దారుణం జరిగింది. షోపియాన్ జిల్లాలో బీహార్ కు చెందిన ముగ్గురు వలస కూలీలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి హతమార్చారు. ఈ ఘటన గగ్రాన్ ప్రాతంలో చోటు చేసుకుంది. దీనిపై సమాచారం అందిన వెంటనే ఆ ప్రాంతాన్ని పోలీసులు, సైన్యం చుట్టుముట్టాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
హిమాచల్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. వాహనం లోయలో పడి ఐదుగురు మృతి, నలుగురికి గాయాలు
గాయపడిన వారిని అన్మోల్ కుమార్, పింటూ కుమార్ ఠాకూర్, హీరాలాల్ యాదవ్ గా గుర్తించారు. వీరిలో ముగ్గురు బీహార్ లోని సుపౌల్ జిల్లాకు చెందిన వారు. క్షతగాత్రులను చికిత్స కోసం వెంటనే హాస్పిటల్ కు తరలించామని కాశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు.
ఈ దాడిని నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ఖండించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ‘‘ఇది చాలా దురదృష్టకరం. ఈ దాడిని ఖండిస్తున్నాం. క్షతగాత్రులు త్వరగా, పూర్తిగా కోలుకుంటారని ఆశిస్తున్నాను’’ అని ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు.
షోపియాన్ జిల్లా గగ్రాన్ లో నిరాయుధులైన స్థానికేతర కార్మికులపై ఉగ్రవాదులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని జమ్మూకశ్మీర్ బీజేపీ అధికార ప్రతినిధి అల్తాఫ్ ఠాకూర్ తెలిపారు. కిరాణా సరుకులు కొనడానికి వెళ్లిన ముగ్గురు స్థానికేతర కార్మికులపై జరిగిన భయంకరమైన దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల నిరాశ, అమానవీయత, చౌకబారుతనాన్ని ఇది ప్రతిబింబిస్తుందని చెప్పారు. ఈ చర్యకు పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని ఠాకూర్ పోలీసులను కోరారు. గాయపడిన ముగ్గురూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.