Asianet News TeluguAsianet News Telugu

ద్రవ్యోల్బణం కంట్రోల్ లోనే ఉంది.. ప్రభుత్వం దానిని మరింత తగ్గిస్తుంది - నిర్మలా సీతారామన్

భారత్ లో ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని, దానిని మరింత తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతాారామన్ అన్నారు. బుధవారం లోక్‌సభలో అదనపు గ్రాంట్‌పై జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. 

Inflation is under control.. Govt will reduce it further - Nirmala Sitharaman
Author
First Published Dec 15, 2022, 10:21 AM IST

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా తన ప్రసంగంలో ‘ఇప్పుడు పప్పు ఎవరు’ అని పార్లమెంటులో తన ప్రసంగంతో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని అవహేళన చేసిన నేపథ్యంలో దేశ ఆర్థిక పరిస్థితిని ప్రస్తావిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ప్రసంగించారు. పప్పును కనుగొనడానికి మొయిత్రా తన పెరట్లో మాత్రమే చూడాలని సీతారామన్ అన్నారు. లోక్‌సభలో అదనపు గ్రాంట్‌పై జరిగిన చర్చకు ఆమె సమాధానమిస్తూ.. ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయి నుంచి తగ్గిందని, దీనిని మరింత తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆమె పేర్కొన్నారు.

ప్రియుడితో పారిపోయిన మొదటి భార్య కోసం.. రెండో భార్యను పాముతో కరిపించి..విషం ఇంజక్షన్ ఇచ్చి...చివర్లో ట్విస్ట్

“నవంబర్ 2022కి వినియోగదారుల ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 5.8 శాతంకు తగ్గింది. ద్రవ్యోల్బణంపై ప్రతిపక్షాలు ఇప్పుడెందుకు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయో అర్థం చేసుకోవడం కష్టం.’’ అని ఆమె ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు 2013లో ద్రవ్యోల్బణం 19.33 శాతంగా ఉందని చెప్పారు.

నేటి నుంచి భారత్-చైనా బార్డర్ లో వైమానిక దళ విన్యాసాలు.. సుఖోయ్, రాఫెల్ యుద్ధ విమానాలు పాల్గొనే అవకాశం..

‘‘నవంబర్ లో టోకు ద్రవ్యోల్బణం గత 21 నెలల్లో అత్యల్పంగా 5.85 శాతానికి తగ్గిందని, అక్టోబర్ లో 8.38 శాతానికి పడిపోయిందని మంత్రి తెలిపారు. ఆహార ద్రవ్యోల్బణం 6.48 శాతం నుంచి 2.17 శాతానికి పడిపోయింది. ప్రధాని నరేంద్ర మోడీ మార్గదర్శకత్వంలో ద్రవ్యోల్బణ నియంత్రణ జరుగుతోంది’’ అని నిర్మలా సీతారామన్ అన్నారు.

నాలుగు నెలలుగా సవతి కూతురిమీద తండ్రి అత్యాచారం..అరెస్ట్...

రూపాయి ఎడతెగకుండా పడిపోవడంపై ప్రభుత్వంపై దాడిని తిప్పికొట్టిన ఆర్థిక మంత్రి.. అనేక దేశాల కరెన్సీతో పోలిస్తే ప్రతీ కరెన్సీకి వ్యతిరేకంగా భారత రూపాయి బలపడిందని అన్నారు. అనేక వర్ధమాన ఆర్థిక వ్యవస్థల కంటే భారత్ చాలా మెరుగైన పనితీరును కనబర్చిందని అన్నారు. టర్కిష్ లిరా విలువ 22 శాతం, జపాన్ యెన్ 11.9 శాతం, దక్షిణాఫ్రికా రాండ్ 15.1 శాతం, చైనా కరెన్సీ 10.6 శాతం క్షీణించాయని చెప్పారు. 

దారుణం.. బీమా డబ్బుకు ఆశపడి స్నేహితుడిని హత్య చేసి, యాక్సిడెంట్ గా చిత్రీకరించి.. చివరికి...

నీరవ్‌ మోడీపై కేంద్రం మెతకగా వ్యవహరిస్తుందా అన్న ప్రతిపక్షాల ప్రశ్నకు సీతారామన్‌ బదులిస్తూ.. యూపీఏ హయాంలో తాను మోసం చేసిన సొమ్మును తిరిగి రాబట్టుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios