ఇండియా-చైనా బార్డర్ లో భారత వైమానిక దళం నేటి నుంచి రెండు రోజుల పాటు విన్యాసాలు నిర్వహించనుంది. రాఫెల్, సుఖోయ్, మిరాజ్‌లతో పాటు మరి కొన్ని యుద్ధ విమానాలు పాల్గొనే అవకాశం ఉంది. 

తవాంగ్‌లో భారత్, చైనా దళాల మధ్య ఘర్షణ కొనసాగుతున్న ఈ క్రమంలో భారత వైమానిక దళం తూర్పు కమాండ్ గురువారం నేడు, రేపు విన్యాసాలను నిర్వహించనుంది. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ తో పాటు ఈశాన్య రాష్ట్రాలలోని అన్ని గగనతలాల్లో ఈ వ్యాయామం జరగనుంది. అ మేరకు వైమానిక దళం ఎయిర్‌మ్యాన్‌కు నోటామ్ ను జారీ చేసింది. తవాంగ్ ఘటనకు ముందే ఈ విన్యాసం నిర్ణయించబడినప్పటికీ, ఈ సమయంలో అరుణాచల్ ప్రదేశ్‌కు ఆనుకుని ఉన్న ఎల్ ఏసీ లో వైమానిక దళం విన్యాసాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

నాలుగు నెలలుగా సవతి కూతురిమీద తండ్రి అత్యాచారం..అరెస్ట్...

అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలో జరగనున్న ఈ కసరత్తు కోసం వైమానిక దళం డిసెంబర్ 8వ తేదీన నోటామ్ జారీ చేసింది. దీని వల్ల ఆ సమయంలో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం గగనతలంలో ఇతర విమానాలు ప్రయాణించకూడదు. భారతీయ వైమానిక దళం, షిల్లాంగ్ (మేఘాలయ)లో ఉన్న ఈస్టర్న్ కమాండ్ ఈ వ్యాయామానికి సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం విడుదల కాలేదు. అయితే తూర్పు కమాండ్‌లోని అన్ని ఎయిర్‌బేస్‌లు ఈ వ్యాయామంలో పాల్గొనే అవకాశం ఉంది. వీటిలో అస్సాంలోని తేజ్‌పూర్, ఝబువా, జోర్హాట్ ఎయిర్ బేస్‌లు పొల్గొననున్నాయి. ఇవే కాకుండా బెంగాల్‌కు చెందిన హసిమారా, కలైకుండ, అరుణాచల్ ప్రదేశ్‌లోని అడ్వాన్స్ ల్యాండింగ్ స్ట్రిప్ ప్రధానంగా ఈ వ్యాయామంలో పాల్గొంటాయి.

Scroll to load tweet…

ఐఏఎఫ్ తన ఫ్రంట్‌లైన్ ఫైటర్ జెట్‌లను రాఫెల్, సుఖోయ్, మిరాజ్‌లతో పాటు చైనా ఫ్రంట్‌లో బలగాల సామర్థ్యాలను పరీక్షించే లక్ష్యంతో ఎక్సర్‌సైజ్ నిర్వహించాలని భావిస్తున్నారు. ఇందులో ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌తో పాటు, సీ-130జే సూపర్ హెర్క్యులస్, చినూక్ హెలికాప్టర్లు, అపాచీ అటాక్ ఛాపర్‌లు ఐఏఎఫ్ ఈ కసరత్తులో పాల్గొనే అవకాశం ఉంది.