Asianet News TeluguAsianet News Telugu

ప్రియుడితో పారిపోయిన మొదటి భార్య కోసం.. రెండో భార్యను పాముతో కరిపించి..విషం ఇంజక్షన్ ఇచ్చి...చివర్లో ట్విస్ట్

ప్రియుడితో పారిపోయిన మొదటి భార్య కోసం ఓ భర్త.. రెండో భర్యను పాముతో కరిపించి చంపాలనుకున్నాడు. కానీ రెండుసార్లు కాటేయించినా చనిపోకపోవడంతో విషం ఇంజక్షన్ ఇచ్చాడు.

Husband got arrested for snake bite for second wife for first wife in madhya pradesh
Author
First Published Dec 15, 2022, 9:52 AM IST

మధ్యప్రదేశ్ : మధ్య ప్రదేశ్ లోని ఓ వ్యక్తికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య ప్రియుడితో పరారవ్వడంతో అతను రెండో పెళ్లి చేసుకున్నాడు. భర్త జైలుకు వెళ్లడంతో ప్రియుడితో కలిసి పరారైన మొదటి భార్య.. అతను జైలు నుంచి తిరిగి వచ్చాడని తెలిసి తాను ఇంటికి వస్తానని పట్టుబట్టింది. దీంతో ఏం చేయాలో పాలుపోని అతను రెండో భార్యను హతమార్చి మొదటి భార్యతో ఉండాలనుకున్నాడు. ట్విస్టుల మీద ట్విస్టులు ఉన్న ఈ కేసు గురించిన పూర్తి వివరాల్లోకి వెళితే…

మధ్య ప్రదేశ్ లో ఓ వ్యక్తి తన మొదటి భార్య తో కలిసి ఉండాలని.. రెండో భార్యను పాముకాటుతో చంపాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం పాముతో కరిపించి విషయం ఎక్కించాలని చూసి ఘటన మధ్యప్రదేశ్లో వెలుగు చూసింది. మధ్యప్రదేశ్ లోని మాల్వా కేడి గ్రామానికి చెందిన మోజిమ్ అజ్మీర్, షాను బీ భార్యాభర్తలు. మోజిమ్ ఓ స్మగ్లింగ్ కేసులో  అరెస్టయి, జైలుకు వెళ్ళాడు. భర్త జైలుకు వెళ్లడంతో షాను బీ తన ప్రియుడితో కలిసి పారిపోయింది.

మోజిమ్ స్మగ్లింగ్ కేసులో రెండేళ్ళ జైలు శిక్ష అనుభవించిన తర్వాత విడుదలై ఇంటికి వచ్చాడు. అప్పటికి భార్య పారిపోయింది అని తెలిసి 2015లో హలీమా బీ అనే యువతిని రెండో వివాహం చేసుకున్నాడు. భర్త తిరిగి రావడం, రెండో వివాహం చేసుకోవడం ఈ మధ్యే తెలిసిన మొదటి భార్య షాను బీ.. తాను తిరిగి ఇంటికి వచ్చేస్తానని భర్తను పట్టుబట్టింది. మోజిమ్ కు అప్పటికే రెండో భార్య మోజు తీరిపోయిందేమో.. మొదటి భార్యతోనే ఉండాలని అనుకున్నాడు. అయితే దీనికి రెండో భార్య ఒప్పుకోదని అనుకున్నాడు. అందుకోసం ఆమెను ఎలాగైనా తప్పించాలని ప్లాన్ వేశాడు. ఆమె హత్యకు కుట్ర పన్నాడు.

నేటి నుంచి భారత్-చైనా బార్డర్ లో వైమానిక దళ విన్యాసాలు.. సుఖోయ్, రాఫెల్ యుద్ధ విమానాలు పాల్గొనే అవకాశం..

పాముతో కాటు వేయించి చంపిస్తే ఎవరికి అనుమానం రాదని అనుకున్నాడు. మోజిమ్ స్నేహితుడు రమేష్ మీనా స్నేక్ క్యాచర్.  ఈనెల 8వ తేదీన అతని దగ్గర నుంచి పాయిజనస్ స్నేక్ ను తీసుకువెళ్లి రెండో భార్యకు కాటువేసేలా చేశాడు. అయితే, పాముకాటుతో కొంతసేపటి వరకు మూర్చపోయిన హలీమా బీ.. వెంటనే మళ్లీ స్పృహలోకి వచ్చింది. దీంతో ఆమెను ఎలాగైనా హతమార్చాలని అనుకున్నాడు. దీనికోసం శుక్రవారం ఉదయం హలీమాను పట్టుకుని స్నేక్ క్యాచర్ అయిన రమేష్ తో ఆమె మీదికి పామును వదిలించాడు.

దీనికి అతని తల్లి, సోదరుడు సహకరించారు. అయినా కూడా ఆమె చనిపోక పోవడంతో విషపూరిత ఇంజక్షన్ ఇచ్చారు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో ఆమె ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. అప్పుడే అక్కడికి వచ్చిన హలీమా తండ్రి అది గమనించి ఆస్పత్రికి తరలించారు. దీని మీద కేసు నమోదు చేసుకున్న పోలీసులు మోజిమ్ తో పాటు, అతని తల్లి, సోదరుడు, స్నేహితుడిని అరెస్ట్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios