Asianet News TeluguAsianet News Telugu

దారుణం.. బీమా డబ్బుకు ఆశపడి స్నేహితుడిని హత్య చేసి, యాక్సిడెంట్ గా చిత్రీకరించి.. చివరికి...

బీమా డబ్బుల కోసం స్నేహితుడిని హతమార్చారు కొందరు. ఆ తరువాత డబ్బును నకిలీ సర్టిఫికెట్లతో క్లెయిమ్ చేసుకున్నారు. వాటిని పంచుకునే విషయంలో గొడవ వచ్చి పోలీసులకు దొరికిపోయారు. 

4 men kills friend for insurance of Rs 4 crores in maharashtra
Author
First Published Dec 15, 2022, 7:28 AM IST

నాసిక్ : మహారాష్ట్రలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. బీమా డబ్బుల కోసం స్నేహితుడిని హత్య చేశారు కొందరు వ్యక్తులు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాసిక్లో కలకలం రేపింది. నాసిక్ లో నివసించే అర్జున్ రమేష్ భలేరావు పేరు మీద రూ. నాలుగు కోట్ల బీమా పాలసీ ఉంది. ఆ విషయం స్నేహితులకు తెలుసు. ఆ సొమ్ము మీద వారి కన్ను పడింది. ఎలాగైనా అర్జున్ ను చంపేసి ఆ డబ్బును కాజేయాలనుకున్నారు. దీనికోసం ఫ్రెండ్స్ పక్కా ప్లాన్ వేశారు. అయితే బీమా చేయించిన తర్వాత రమేష్ నాసిక్ లో లేడు. దీంతో వీరి ప్లాన్  వర్కౌట్ కాలేదు.

మూడేళ్ల తర్వాత ఇటీవలే రమేష్ నాసిక్ కి వచ్చాడు. ఇదే అదనుగా భావించిన అతని నలుగురు స్నేహితులు మరో మహిళ సహాయంతో రమేష్ ని హత్య చేశారు. భీమా డబ్బులు రావాలంటే,  తాము దొరకకుండా ఉండాలంటే  అది  అది ప్రమాదంగా చిత్రీకరించాలని అనుకున్నారు. ప్రమాదవశాత్తు మరణించాడని అందరికీ చెప్పారు. రమేష్ బైక్ మీద వెళ్తుంటే వెనక నుండి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టిన ట్లుగా  చెప్పారు.  పోలీసులు అలాగే కేసు నమోదు చేసుకున్నారు. 

లవ్ జిహాద్‌పై ప్రత్యేక చట్టం అవసరం లేదు: కర్ణాటక హోం మంత్రి

అయితే అంతా బాగానే ప్లాన్ చేశారు కానీ సోము పంచుకునే విషయంలోనే ఐదుగురు నిందితులు మధ్య గొడవలు వచ్చాయి. ఈ గొడవలతో విసుగు చెందిన వారిలో ఒకరు..  రమేష్ సోదరుడికి అసలు విషయం చెప్పారు. అంతేకాదు... అర్జున్ రమేష్ భలేరావు భార్య రజినీ ఉకే పేరుతో ఓ మహిళ నకిలీ  డాక్యుమెంట్ లను  ఇచ్చి భీమా డబ్బులను మొత్తం తీసుకు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత నిందితుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు నుంచి తుపాకీ, 6 తూటాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన ముగ్గురు కోసం గాలిస్తున్నారు. 

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే నవంబర్ 25న ఏపీలోని నంద్యాలలో వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి రెండో భార్యను ఆత్మహత్య చేసుకుంటే బీమా వస్తుందంటూ వేదించాడు. నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలం చాకరాజువేముల గ్రామానికి చెందిన మహేంద్రబాబుకు మార్కాపురానికి చెందిన ఓ మహిళతో వివాహం జరిగింది. ఈ విసయం దాచిపెట్టి తన గ్రామానికే చెందిన మరో మహిళను ప్రేమించి నాలుగేళ్ళ క్రితం పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్య ఆత్మహత్య చేసుకుంటే ఆమెకు సంబంధించిన బీమా డబ్బులు వస్తాయని తల్లి వద్ద ప్రస్తావించాడు. ఈ క్రమంలో ఆత్మహత్య చేసుకోవాలని భార్యను బలవంతం చేసేవాడు. భరించలేక ఆమె హైదరాబాద్ కు వెళ్లిపోయింది. 

మూడేళ్ల తరువాత కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం వక్కలగడ్డ గ్రామానికి చెందిన మరో మహిళతో మహేంద్రబాబు పరిచయం పెంచుకున్నాడు. తనకు పెళ్లి కాలేదని నమ్మించి, ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమె నుంచి రూ.5 లక్షలు, ఆమె తల్లి ఫోన్ ద్వారా ప్రైవేట్ లోన్ యాప్ నుంచి రూ.5 లక్షలు రుణం తీసుకున్నాడు. మూడో పెళ్లి విషయం తెలిసిన రెండో భార్య అతని మీద, అతని తల్లి మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. దీని మీద దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపాలు గురువారం తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios