ద్రవ్యోల్బణం ప్రపంచ సమస్య.. భారత్ పరిస్థితులపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
New Delhi: ద్రవ్యోల్బణం ప్రపంచ సమస్య అనీ, దీనిని ఎదుర్కొవడానికి అన్ని వైపుల నుంచి సన్నిహిత సహకారం అవసరమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కోవిడ్ -19 మహమ్మారి, భౌగోళిక-రాజకీయ సంఘర్షణ కొనసాగుతున్న సమయంలో ప్రపంచ ద్రవ్యోల్బణం డైనమిక్స్ ను మార్చాయని పేర్కొన్నారు.

Prime Minister Narendra Modi: "ప్రపంచం ఎదుర్కొంటున్న కీలక సమస్య ద్రవ్యోల్బణం. మొదట కరోనా వైరస్ మహమ్మారి, తరువాత అంతర్జాతీయ రాజకీయ సంఘర్షణలు ప్రపంచ ద్రవ్యోల్బణ గతిశీలతను మార్చాయి. ఫలితంగా, అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు రెండూ అధిక ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇది ప్రపంచ సమస్య, దీనికి సన్నిహిత సహకారం అవసరం అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. జీ-20 అధ్యక్షునిగా భారత్ ఉన్న సమయంలో జీ-20 దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశం జరిగిందనీ, ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి ప్రతి దేశం తీసుకుంటున్న విధానాలు ఇతర దేశాలలో ప్రతికూల పరిణామాలకు దారితీయకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
మానవ కేంద్రీకృత విధానంతో భారత వృద్ధిని సాధిస్తున్నామనీ, దీనిని ఇతర దేశాల్లో కూడా అనుకరించవచ్చని ప్రధాని నరేంద్ర మోడీ ఒక ఇంటర్వ్యూలో అన్నారు. అలాగే, ద్రవ్యోల్బణం ప్రపంచ సమస్య అనీ, దీనికి అన్ని వైపుల నుంచి సన్నిహిత సహకారం అవసరమని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ద్రవ్యోల్బణం అని మనీకంట్రోల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మోడీ పేర్కొన్నారు. భారత్ సహా చాలా దేశాల్లో ద్రవ్యోల్బణంపై అడిగిన ప్రశ్నకు ప్రధాని సమాధానమిస్తూ, కోవిడ్ -19 మహమ్మారి, కొనసాగుతున్న భౌగోళిక-రాజకీయ సంఘర్షణ ప్రపంచ ద్రవ్యోల్బణ డైనమిక్స్ ను మార్చాయని అన్నారు. ఫలితంగా అభివృద్ధి చెందిన దేశాలు, వర్ధమాన ఆర్థిక వ్యవస్థలు అధిక ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇది ప్రపంచ సమస్య అనీ, దీనికి సన్నిహిత సహకారం అవసరమని మోడీ స్పష్టం చేశారు.
ఈ వారం చివర్లో న్యూఢిల్లీలో జరగనున్న జీ20 వరల్డ్ లీడర్స్ సమ్మిట్ కు ముందు జీ20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశం జరిగింది. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి ప్రతి దేశం తీసుకునే విధానాలు ఇతర దేశాల్లో ప్రతికూల పరిణామాలకు దారితీయకుండా చూడాల్సిన అవసరం ఉందని ఈ ఫోరం గుర్తించింది. ఇందుకోసం కేంద్ర బ్యాంకులు విధానపరమైన నిర్ణయాలను సకాలంలో, స్పష్టంగా తెలియజేయడం చాలా కీలకమని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. భారత ద్రవ్యోల్బణంపై మాట్లాడుతూ.. భారతదేశానికి సంబంధించినంత వరకు, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని మోడీ అన్నారు. ప్రతికూలతలు, ప్రపంచ డైనమిక్స్ నేపథ్యంలో కూడా భారత ద్రవ్యోల్బణం 2022లో ప్రపంచ సగటు ద్రవ్యోల్బణం రేటు కంటే రెండు శాతం తక్కువగా ఉంది. అయినా మనం ఆ విషయంలో విశ్రమించడం లేదనీ, జీవన సౌలభ్యాన్ని పెంపొందించేందుకు ప్రజా అనుకూల నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నామన్నారు. ఉదాహరణకు, ఇటీవల రక్షా బంధన్ రోజున తాము వినియోగదారులందరికీ ఎల్పీజీ ధరలను ఎలా తగ్గించామో అందరికీ తెలుసునని అన్నారు.