Asianet News TeluguAsianet News Telugu

ఇండియన్ ఆర్మీ శక్తివంతమైనదే.. కానీ మోడీ ప్రభుత్వం చాలా వీక్.. అది చైనాకు భయపడుతోంది - ఒవైసీ

ఇండియన్ ఆర్మీ చాలా శక్తివంతమైనదని, కానీ మోడీ ప్రభుత్వం చాలా బలహీనమైనదని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. కేంద్రం చైనాకు భయపడుతోందని ఆరోపించారు. 

Indian Army is powerful.. But Modi government is very weak.. It is afraid of China - Owaisi
Author
First Published Dec 20, 2022, 12:06 PM IST

వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణపై పార్లమెంట్‌లో చర్చ జరపడంలో ప్రధాని మోడీ విఫలమయ్యారని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సోమవారం విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్‌లోని భారత భూభాగంలోకి ఎవరూ ప్రవేశించలేదని ప్రధాని మోడీ దేశాన్ని తప్పుదోవ పట్టించారని ఆరోపించారు.

ఈరోజు హైదరాబాద్‌కు పంజాబ్ ‌సీఎం భగవంత్ మాన్.. ప్రగతి భవన్‌లో కేసీఆర్‌తో లంచ్ మీటింగ్..!

ఈ మేరకు ఆయన వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’తో మాట్లాడారు. ‘‘ మన భూభాగంలోకి ఎవరూ ప్రవేశించలేదని ప్రధాని మోడీ దేశాన్ని తప్పుదోవ పట్టించారు. చైనా సైనికులు డెప్సాంగ్,  డెమ్‌చోక్‌లను ఆక్రమించారని చూపించే శాటిలైట్ ఫొటోలు ఉన్నాయి. వారు మన భూమిని లాక్కుంటుంటే మనం వారితో వ్యాపారం చేయడం కొనసాగిస్తామా ? ’’ అని ఆయన ప్రశ్నించారు.

ఇటుకతో భర్తను కొట్టి చంపిన భార్య.. మార్కెట్ కు వెళ్లొద్దన్నాడని నడివీధిలో దారుణం..

భారత సైన్యం చాలా శక్తివంతమైనదని, కానీ మోడీ ప్రభుత్వం చాలా బలహీనంగా ఉందని, చైనాను చూసి భయపడుతోందని ఆయన అన్నారు. ‘‘ చైనాతో తమ ప్రణాళికలేమిటో ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి చెప్పాలి. లేదా పార్లమెంటులో చర్చ జరపాలి. ప్రభుత్వం రాజకీయ నాయకత్వాన్ని ప్రదర్శిస్తే, దేశం మొత్తం వారికి మద్దతు ఇస్తుంది. మన సైన్యం చాలా శక్తివంతమైనది, కానీ ప్రభుత్వం చాలా బలహీనంగా ఉంది. చైనాను చూసి భయపడుతుంది’’ అని ఆయన అన్నారు.

ప్రియురాలి భర్తను చంపి, అతడి ఇంట్లోనే శవాన్ని పాతిపెట్టిన ప్రియుడు.. మద్యం మత్తులో చెప్పేయడంతో..

ఎల్ఏసీ వద్ద ప్రస్తుత పరిస్థితికి సంబంధించి కేంద్రం ప్రజలను, పార్లమెంటును చీకటిలో ఉంచిందని ఒవైసీ గురువారం పేర్కొన్నారు. ‘‘మోడీ ప్రభుత్వం ప్రజలను, పార్లమెంటును చీకటిలో పడేసింది. చైనా బయటకు వస్తున్న సత్యాన్ని చూసి ఎందుకు భయపడుతోంది? చైనా దురాక్రమణకు సంబంధించిన వాస్తవాలను దాచడానికి మోడీకి ఆసక్తి ఏమిటి? ’’ అని అంటూ సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ లోని వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి చైనా దురాక్రమణకు సంబంధించిన వార్తా క్లిప్ ను జత చేస్తూ ఒవైసీ ట్వీట్ చేశారు.

ఇదిలా ఉండగా.. అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ లోని యాంగ్సే ప్రాంతంలో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) దళాలు వాస్తవాధీన రేఖను ఉల్లంఘించడానికి ప్రయత్నించాయని, యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చడానికి ప్రయత్నించాయని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సోమవారం రాజ్యసభకు తెలిపారు. ‘‘మన ప్రాదేశిక సమగ్రతను రక్షించడానికి మన దళాలు కట్టుబడి ఉన్నాయి. యథాతథ స్థితిని మార్చడానికి చేసే ఏ ప్రయత్నాన్ని అయినా అడ్డుకుంటాయి. ’’ అని రక్షణ మంత్రి ఎగువ సభకు హామీ ఇచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios