ఇండియాలో కరోనా కేసుల పెరుగుదల: మొత్తం 3,40,20, 730కి చేరిక
ఇండియాలో గత 24 గంటల్లో 18,987 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసులు 3,40,20, 730కి చేరుకొన్నాయి.ఇండియాలో కరోనా యాక్టివ్ కేసులు 2,06,586కి చేరుకొన్నాయి.
న్యూఢిల్లీ: India లో కరోనా కేసుల వ్యాప్తి కొనసాగుతుంది. అంతకు ముందు రోజుతో పోలిస్తే నిన్న corona కేసులు మళ్లీ పెరిగాయి. గత 24 గంటల్లో 18,987 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు రోజుతో పోలిస్తే నిన్న ఒక్క రోజే 16శాతం అదనంగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసులు 3,40,20, 730కి చేరుకొన్నాయి.
also read:చిత్తూరులో కరోనా జోరు: ఏపీలో మొత్తం కేసులు 20,58,582కి చేరిక
నిన్న ఒక్క రోజే కరోనాతో 246 మంది మరణించారు. దీంతో దేశంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,51,435కి చేరింది.దేశంలో కొత్త కరోనా వైరస్ కేసులు 30 వేల కంటే తక్కువగా 20 రోజుల నుండి నమోదౌతున్నాయి.109 రోజులుగా కరోనా కేసులు 50 వేల కంటే తక్కువగా రికార్డు అవుతున్నాయి.
ఇండియాలో covid-19 యాక్టివ్ కేసులు 2,06,586కి చేరుకొన్నాయి. నిన్న కరోనా నుండి 19,808 మంది కోలుకొన్నారు. ఇప్పటివరకు కరోనా రోగుల సంఖ్య 3.33 కోట్లకు చేరుకొంది. కరోనా రికవరీ రేటు 98.07 శాతంగా నమోదైందని Icmr తెలిపింది.
బుధవారం నాడు ఒక్క రోజే 13,01,083 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. నిన్నటివరకు దేశ వ్యాప్తంగా 58,76,64,525 మందికి కరోనా పరీక్షలు చేశారు.బుధవారం నాడు 35.66 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ అందించారు.ఇప్పటివరకు 96.82 కోట్ల కరోనా వ్యాక్సిన్ అందించినట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
ఇండియాలో 2020 ఆగష్టు 7న 20 లక్షలు, ఆగష్టు 23న 30 లక్షలు, సెప్టెంబర్ 5న 40 లక్షలు,సెప్టెంబర్ 16న 50 లక్షలకు కరోనా కేసులు చేరాయి. సెప్టెంబర్ 28న 60 లక్షలు, అక్టోబర్ 11న 70 లక్షలు, అక్టోబర్ 29న 80 లక్షలు, నవంబర్ 20న 90 లక్షల కేసులు దాటాయి.డిసెంబర్ 19న కోటి కేసులను దాటాయి.ఈ ఏడాది మే 4న రెండు కోట్ల కేసులను దాటాయి.ఈ ఏడాది జూన్ 23న కరోనా కేసులు మూడు కోట్లను దాటాయి.