దేశంలో కరోనా కేసులు నిన్నటితో పోలిస్తే కొంచెం తగ్గాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య 34,414,186 కోట్లకి చేరింది. కరోనా యాక్టివ్ కేసులు 267 కనిష్టానికి చేరుకొన్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు వ్యాక్సిన్ ను మరింత వేగవంతం చేసింది కేంద్ర ప్రభుత్వం.

న్యూఢిల్లీ: Indiaలో గత 24 గంటల్లో 12,516 కొత్త Corona కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 3,44,14,186 కోట్లకి చేరింది.మరో వైపు కరోనాతో 501 మంది చనిపోయారు.దేశంలో నమోదైన 501 కరోనా మరణాల్లో అత్యధికంగా కేరళ రాష్ట్రంలోనే రికార్డయ్యాయి. కేరళ రాష్ట్రంలో 419 మంది కరోనాతో మరణించినట్టుగా కేరళ రాష్ట్రం తెలిపింది. నిన్న ఒక్క రోజే కరోనా నుండి 13,155 మంది కోలుకున్నారు. ఇప్పటివకు కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్య 3,38,14,080కి చేరింది. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1,37,416 లక్షలకు చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కరోనా యాక్టివ్ కేసులు 1 శాతం లోపుగా పడిపోయినట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.267 రోజుల కనిష్టానికి కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య చేరుకొందని అధికారులు తెలిపారు. కరోనా రోగుల రికవరీ రేటు 98.26 గా రికార్డైంది. కరోనా రోగుల రికవరీ రేటు ఈ ఏడాది మార్చి తర్వాత అత్యధికమని ఐసీఎంఆర్ ప్రకటించింది.

వారాంతపు కరోనా పాజిటివిటీ రేటు 1.10 శాతంగా నమోదైంది. వీక్లి కరోనా పాజిటివిటీ రేటు 49రోజులుగా 2 శాతానికి తక్కువగా నమోదౌతుంది. రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 1.07 శాతంగా రికార్డైంది. 39 రోజులుగా 2 శాతం కంటే రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు నమోదైందని గణాంకాలు చెబుతున్నాయి.దేశంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 4.62,690 లక్షలకు చేరుకొంది. ఇండియాలో 2020 ఆగష్టు 7న 20 లక్షలు, ఆగష్టు 23న 30 లక్షలు, సెప్టెంబర్ 5న 40 లక్షలు,సెప్టెంబర్ 16న 50 లక్షలకు కరోనా కేసులు చేరాయి. సెప్టెంబర్ 28న 60 లక్షలు, అక్టోబర్ 11న 70 లక్షలు, అక్టోబర్ 29న 80 లక్షలు, నవంబర్ 20న 90 లక్షల కేసులు దాటాయి.డిసెంబర్ 19న కోటి కేసులను దాటాయి.ఈ ఏడాది మే 4న రెండు కోట్ల కేసులను దాటాయి.ఈ ఏడాది జూన్ 23న కరోనా కేసులు మూడు కోట్లను దాటాయి.

also read:తెలంగాణ: 24 గంటల్లో 153 మందికి కరోనా పాజిటివ్.. 6,73,140కి చేరిన కేసుల సంఖ్య

గత 24 గంటల్లో 53.81 లక్షల మంది కరోనా వ్యాక్సిన్ తీసుకొన్నారు. ఇప్పటి వరకు ఇండియాలో 110.79 కోట్ల మంది కరోనా వ్యాక్సిన్ తీసుకొన్నారని ఐసీఎంఆర్ ప్రకటించింది. దేశంలోని 71 శాతం జనాబా కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ ను తీసుకొన్నారు. దాదాపుగా 35 శాతం ప్రజలు కరోనా రెండు డోసులను తీసుకొన్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇండియాలో బూస్టర్ డోస్ కోసం ప్రభుత్వం త్వరలోనే మార్గదర్శకాలను జారీ చేసే అవకాశం ఉందని సమాచారం. అండమాన్ నికోబార్ లో గత 24 గంటల్లో 11 మందికి కరోనా సోకింది. దీంతో కరోనా రోగుల సంఖ్య 7,668కి చేరుకొంది. 

అండమాన్ నికోబార్ లో గత 24 గంటల్లో 11 మందికి కరోనా సోకింది. దీంతో కరోనా రోగుల సంఖ్య 7,668కి చేరుకొంది. మేఘాలయ రాష్ట్రంలో 20 కరోనా కొత్త కేసులు నిన్న నమోదయ్యాయి. ఈ రాష్ట్రంలో కరోనా కేసులు 83,962కి చేరాయి. నిన్న ఒక్కరు కరోనాతో చనిపోయారు. రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 1462కి చేరిందని అధికారులు తెలిపారు.