ఇండియాలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు: మొత్తం 3,39,85,920కి చేరిక
ఇండియాలో కరోనా కేసులు గత 24 గంటల్లో 14,313 మందికి కరోనా సోకింది.ఇండియాలో కరోనా కేసులు 3,39,85,920కి చేరుకొన్నాయి.దేశంలో కరోనా యాక్టివ్ కేసులు 2,14,900కి చేరాయి.
న్యూఢిల్లీ: ఇండియాలో గత 24 గంటల్లో 14,313 మందికి కరోనా సోకింది.అంతకు ముందు ఇండియాలో 18 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు రోజుతో పోలిస్తే నిన్న నాలుగు వేల కేసులు తగ్గాయి.
also read:గుంటూరులో కరోనా జోరు: ఏపీలో మొత్తం 20,57,562కి చేరిక
India లో కరోనా కేసులు 3,39,85,920కి చేరుకొన్నాయి.దేశంలో కరోనా యాక్టివ్ కేసులు 2,14,900కి చేరాయి.గత 212 రోజుల్లో యాక్టివ్ కేసులు ఇంత తక్కువ సంఖ్యకు చేరుకోవడం ఇదే ప్రథమంగా అధికారులు చెబుతున్నారు. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య0.63 శాతంగా ఉందని icmr ప్రకటించింది.
coronaతో నిన్న ఒక్క రోజు 181 మంది మరణించారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనాతో 4,50,963 మంది మరణించారు.గత 24 గంటల్లో కరోనా నుండి 26,579 మంది కోలుకొన్నారు. ఇండియాలో కరోనా రోగుల రికవరీ రేటు 98.04 శాతంగా నమోదైంది. గత ఏడాది మార్చి నుండి కరోనా రోగుల రికవరీ రేటు ఇదే అత్యధికమని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
ఇండియాలో 2020 ఆగష్టు 7న 20 లక్షలు, ఆగష్టు 23న 30 లక్షలు, సెప్టెంబర్ 5న 40 లక్షలు,సెప్టెంబర్ 16న 50 లక్షలకు కరోనా కేసులు చేరాయి.
సెప్టెంబర్ 28న 60 లక్షలు, అక్టోబర్ 11న 70 లక్షలు, అక్టోబర్ 29న 80 లక్షలు, నవంబర్ 20న 90 లక్షల కేసులు దాటాయి.డిసెంబర్ 19న కోటి కేసులను దాటాయి.ఈ ఏడాది మే 4న రెండు కోట్ల కేసులను దాటాయి.ఈ ఏడాది జూన్ 23న కరోనా కేసులు మూడు కోట్లను దాటాయి.