మధ్యాహ్నం 12 గంటలకు జరగాల్సిన ఇండియా, పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO)ల చర్చలు వాయిదా పడ్డాయి. ఈ చర్చలు సాయంత్రం జరుగుతాయని అంచనా.
మధ్యాహ్నం 12 గంటలకు జరగాల్సిన ఇండియా, పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO)ల చర్చలు వాయిదా పడ్డాయి. ఈ చర్చలు సాయంత్రం జరుగుతాయని అంచనా.19 రోజుల్లో మొదటిసారిగా జమ్మూ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (LoC) వద్ద ప్రశాంత వాతావరణం నెలకొందని భారత సైన్యం తెలిపింది. అయితే, మన సైన్యం అప్రమత్తంగా ఉందని, పశ్చిమ సరిహద్దు రాష్ట్రాలు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాయని భారత్ పేర్కొంది.ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు 26 మందిని చంపిన తర్వాత ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి.
దీనికి ప్రతిస్పందనగా భారత్ ఆపరేషన్ సింధూర్‌ను ప్రారంభించింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారని, ఉగ్రవాద మౌలిక సదుపాయాలకు గణనీయమైన నష్టం వాటిల్లిందని తెలుస్తోంది.పాకిస్తాన్ కూడా క్షిపణి, డ్రోన్ దాడులతో ప్రతిస్పందించింది. దీంతో భారత సైన్యం తీవ్ర ప్రతీకార దాడులు చేసింది. దీంతో ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని పాకిస్తాన్ సైన్యం కోరింది. మే 10న కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం, ఇరు దేశాలు భూమి, గాలి, సముద్రంలో అన్ని సైనిక చర్యలను వెంటనే నిలిపివేయడానికి అంగీకరించాయి.
అయితే, కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. దీంతో భారత్, మళ్లీ ఉల్లంఘిస్తే తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరించింది.


