coronavirus: మ‌రో హైద‌రాబాద్ క‌రోనా వ్యాక్సిన్ కు అనుమ‌తి.. దేశంలో అందుబాటులో ఉన్న టీకాలివే !

coronavirus: కొత్త‌గా వెలుగుచూసిన క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప‌లు దేశాల్లో పంజా విసురుతూ.. అక్కడి ప‌రిస్థితుల‌ను దారుణంగా మారుస్తోంది. భార‌త్ లోనూ ఈ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే వైర‌స్ క‌ట్ట‌డి చ‌ర్య‌లను కేంద్ర ప్ర‌భుత్వం ముమ్మ‌రం చేసింది. దీనిలో భాగంగా హైద‌రాబాద్ క‌రోనా టీకా కార్బివాక్స్ తో పాటు మ‌రో వ్యాక్సిన్‌, ఓ యాంటీవైర‌ల్ డ్ర‌గ్ కు కేంద్రం అత్య‌వ‌స‌ర వినియోగం కింద ఆమోదం తెలిపింది. 
 

India Clears 2 New Vaccines And Merck's Covid Pill

coronavirus: ద‌క్షిణాఫ్రికాలో గ‌త నెల‌లో వెలుగుచూసిన క‌రోనా వైర‌స్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప‌లు దేశాల్లో పంజా విసురుతోంది. మ‌రీ ముఖ్యంగా ఒమిక్రాన్ వెలుగుచూసిన త‌ర్వాత అమెరికా, బ్రిట‌న్‌, ఫ్రాన్స్ స‌హా ప‌లు దేశాల్లో నిత్యం లక్ష‌ల్లో క‌రోనా వైర‌స్ కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. భార‌త్ లోనూ ఈ కేసులు క్ర‌మంగా పెరుగుతుండ‌టంపై ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. కోవిడ్-19 క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా క‌రోనా వైరస్ ప‌రీక్ష‌లు పెంచ‌డంతో పాటు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను ముమ్మ‌రంగా కొన‌సాగిస్తోంది అధికార యంత్రాంగం. ఇప్ప‌టికే ఒమిక్రాన్ నేప‌థ్యంలో ప‌లు రాష్ట్ర ప్ర‌భుత్వాలు కొత్త సంవ‌త్స‌ర వేడుక‌ల‌పై ఆంక్ష‌లు, నైట్ క‌ర్ఫ్యూలు విధించాయి. తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డిలో కీల‌క ముంద‌డుగు వేసింది. వైర‌స్ క‌ట్ట‌డి చ‌ర్య‌లను కేంద్ర ప్ర‌భుత్వం ముమ్మ‌రం చేస్తూ..  హైద‌రాబాద్ క‌రోనా టీకా కార్బివాక్స్ తో పాటు మ‌రో వ్యాక్సిన్‌, యాంటీవైర‌ల్ డ్ర‌గ్ కు అత్య‌వ‌స‌ర వినియోగం కింద ఆమోదం తెలిపింది. క‌రోనా నేప‌థ్యంలో అత్య‌వ‌స‌ర వినియోగానికి అనుమ‌తి పొందిన వాటిలో హైద‌రాబాద్ చెందిన క‌రోనా టీకా కార్బివాక్స్,  సీరం త‌యారు చేసిన కోవిడ్ టీకా కోవోవాక్స్, యాంటీ-వైరల్ డ్రగ్ మోల్నుపిరవిర్ ఉన్నాయి.

Also Read: Work From Home: ఒమిక్రాన్ దెబ్బ‌.. ఈ కంపెనీల్లో శాశ్వ‌తంగా వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం !

కరోనా కట్టడికి దేశంలో ప్రస్తుతం 8 వ్యాక్సిన్లు, నాలుగు ఔషధాలు, చికిత్స విధానాలకు అత్యవసర వినియోగం కింద అనుమతులు లభించాయి. క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డి కోసం దేశంలో అందుబాటులో ఉన్న టీకాల్లో  కోవిషీల్డ్, కోవాక్సిన్, జైకోవి-డి, స్పుత్నిక్ వి, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్, కార్బివాక్స్, కోవోవాక్స్ లు ఉన్నాయి. తాజాగా అత్య‌వ‌స‌ర వినియోగం కింత అనుమ‌తులు పొందిన వాటిలో హైదరాబాద్‌కు చెందిన ‘బయలాజికల్‌ ఈ’  కరోనా వైరస్‌ స్పైక్‌ ప్రొటీన్‌లోని గ్లెకోప్రొటీన్‌లో ఉన్న కీలకమైన ఆర్బీడీ ఆధారంగా త‌యారు చేసిన కార్బివాక్స్ క‌రోనా టీకా ఉంది. ఈ టీకాను రెండు డోసుల్లో అందిస్తారు. కార్బివాక్స్‌ను బూస్టర్‌ డోసుగా వినియోగించడంపై మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించేందుకు బయలాజికల్‌ ఈ సంస్థకు డీసీజీఐ అనుమతినిచ్చినట్టు సమాచారం. రిసెప్టార్‌ బైండింగ్‌ డొమైన్‌ (ఆర్బీడీ) ప్రొటీన్‌ సబ్‌ యూనిట్‌ ఆధారంగా భారత్‌లో అభివృద్ధి చేసిన మొట్టమొదటి వ్యాక్సిన్ కార్బివాక్స్ కావ‌డం గ‌మ‌నార్హం. దీనిని 28 రోజుల స‌మ‌యం వ్య‌వ‌ధితో అందిస్తారు. 

Also Read: Mukesh Ambani: వారసుల చేతుల్లోకి రిలయన్స్‌.. ముఖేష్ అంబానీ కీలక వ్యాఖ్య‌లు !

ప్ర‌భుత్వం అత్య‌వ‌స‌ర వినియోగం కింద అనుమ‌తి తెలిపిన మ‌రో వ్యాక్సిన్ కోవోవాక్స్. ఈ టీకా త‌యారీకి  అమెరికాకు చెందిన నొవావాక్స్‌ సంస్థ సహకారం అందిస్తుండ‌గా,  దేశీయంగా సీరం సంస్థ ఈ నానోపార్టికల్‌ టీకాను ఉత్పత్తి చేస్తున్నది.  దీనిని రెండు డోసులుగా అందిస్తారు. అలాగే, క‌రోనా వైర‌స్ సోకిన త‌ర్వాత చికిత్స‌కు ఉప‌యోగించే మ‌రో యాంటీ-వైరల్ డ్రగ్ మోల్నుపిరవిర్ కు  ప్ర‌భుత్వం అత్య‌వ‌స‌ర వినియోగం కింద అనుమంతి ఇచ్చింది.  అమెరికాకు చెందిన మెర్క్‌ సంస్థ దీన్ని తయారుచేసింది. బ్రిటన్‌, అమెరికాలో ఇప్పటికే దీనిని వినియోగిస్తున్నారు. ఈ యాంటీ-వైరల్ డ్రగ్ మోల్నుపిరవిర్ ను క‌రోనా మ‌హ‌మ్మారితో బాధపడుతున్న 18 సంవ‌త్స‌రాలు పైబ‌డిన వారికి ఆక్సిజన్‌ స్థాయిలు 93 శాతానికి పడిపోయినవారికి, వ్యాధి ముదిరే ప్రమాదం ఎక్కువగా ఉన్నవారికి అత్యవసర పరిస్థితుల్లో, వైద్యుల సిఫారసు మేరకే  ఈ డ్ర‌గ్ ను అందిస్తారు.  రోజుకు 8 డోసుల చొప్పున తీసుకోవాల్సి ఉంటుంది.  అలాగే, ఐదురోజుల‌కు మించి యాంటీ-వైరల్ డ్రగ్ మోల్నుపిరవిర్ డ్ర‌గ్ ను తీసుకోరాదు.  ఇదిలావుండ‌గా, ప్ర‌ప‌చంలోని చాలా దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తోంది. ఈ కేసులు క్ర‌మంగా పెరుగుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. సాధార‌ణ కోవిడ్‌-19 కేసులు సైతం క్ర‌మంగా పెరుగుతున్నాయి. భార‌త్ లోనూ ఈ వేరియంట్ కేసులు పెరుగుతుండ‌టంపై ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. 

Also Read: Assembly Election 2022: ఒమిక్రాన్ సాకుతో ఎన్నిక‌ల వాయిదాకు బీజేపీ కుట్ర.. ఛ‌త్తీస్ గ‌ఢ్ సీఎం !

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios