ఆర్మీ జవాను భార్య పట్ల పలువురు అనుచితంగా ప్రవర్తించిన ఘటన తమిళనాడులో రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. 

కాశ్మీర్ లో విధులు నిర్వహిస్తున్న ఆర్మీ జవాను భార్య పట్ల పలువురు అనుచితంగా ప్రవర్తించారు. తమిళనాడుకు చెందిన బాధితురాలు ఈ విషయాన్ని మీడియాతో ఆదివారం వెల్లడించారు. తనపై 40 మందికి పైగా దాడి చేశారని, అలాగే అసభ్య పదజాలంతో దూషించారని ఆమె తెలిపారు. తన శరీరాన్ని అనుచితంగా తాకారాని, తమ కుటుంబాన్ని ప్రశాంతంగా బతకనివ్వడం లేదని అన్నారు. పలువురు తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆమె వెల్లూరులో మీడియాతో వెల్లడించినట్టు ‘ఎన్డీటీవీ’ నివేదించింది.

బిపార్జోయ్ తుఫాను బీభత్సం.. ముంబై విమానాశ్రయంలో గందరగోళ పరిస్థితులు

కాగా.. అంతకు ముందు తన భార్యను పాక్షికంగా బట్టలు విప్పి తీవ్రంగా కొట్టారని ఆర్మీలో హవిల్దార్ గా ఉన్న ప్రభాకరన్ ఆరోపించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కాశ్మీర్ లో విధులు నిర్వహిస్తున్న ఆయన ఓ వీడియో విడుదల చేశారు. శనివారం వైరల్ గా మారిన ఆ వీడియాలో ‘‘నా భార్య లీజుకు తీసుకున్న స్థలంలో దుకాణం నడుపుతోంది. ఆమెను 120 మంది వ్యక్తులు చితకబాది దుకాణంలోని వస్తువులను బయటకు విసిరేశారు. ఎస్పీకి వినతిపత్రం పంపాను. ఆయన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. డీజీపీ సర్, దయచేసి సాయం చేయండి. నా కుటుంబంపై కత్తులతో దాడి చేసి బెదిరించారు. నా భార్యను అర్ధనగ్నంగా చేసి దారుణంగా కొట్టారు. ’’ అని అన్నారు. ప్రభాకరన్ మాట్లాడిన వీడియోను రిటైర్డ్ ఆర్మీ అధికారి లెఫ్టినెంట్ కల్నల్ ఎన్ త్యాగరాజన్ పోస్ట్ చేశారు.

విషాదం.. 11 ఏళ్ల మూగ బాలుడిని కరిచి చంపిన వీధి కుక్కలు.. ఎక్కడంటే ?

కాగా.. జవాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తిరువణ్ణామలై పోలీసు సూపరింటెండెంట్ కార్తికేయన్ తెలిపారు. ‘‘జవాన్ ఫిర్యాదు మేరకు సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ (ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్) నమోదు చేశారు. నిందితులు రాము, హరిప్రసాద్ లను ఇప్పటికే అరెస్టు చేశారు’’ అని ఎస్పీ తెలిపారు. సివిల్ వివాదమే ఈ ఘటనకు కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని చెప్పారు.

పండరీపూర్ కు వెళ్తున్న భక్తులపై మహారాష్ట్ర పోలీసుల లాఠీచార్జి.. మొఘలులు మళ్లీ జన్మించారని ప్రతిపక్షాల ఫైర్

‘‘ఇది సివిల్ వివాద ఫలితమేనని తెలుస్తోంది. అవును, కొన్ని విషయాలు జరిగాయి. అయితే, ప్రస్తుతానికి మేము చెబుతున్నది ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా మాత్రమే. మరో రెండు రోజుల్లో సమగ్ర విచారణ జరిపితే ఏం జరిగిందో తెలుస్తుందని’’ అని కార్తికేయన్ తెలిపారు.