మహారాష్ట్రలోని పండరీపూర్ కు వెళ్లే భక్తులను అదుపు చేసేందుకు పోలీసులు స్వల్ప లాఠీ చార్జి చేశారు. అయితే దీనిపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. మహారాష్ట్రలో మొఘలులు మళ్లీ జన్మించారని ఆరోపించాయి. 

పుణె జిల్లాలోని పండరీపూర్ లోని ఓ ఆలయానికి వెళ్తున్న వార్కారీ భక్తులపై మహారాష్ట్ర పోలీసులు లాఠీచార్జి చేశారు. శ్రీకృష్ణుడి మరో రూపంగా భావించే విఠోబా భక్తులైన వార్కరీలు పోలీసు చర్యకు గురికావడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. ఊరేగింపు సందర్భంగా భక్తులు పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. పూణే నగరానికి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న అలండి పట్టణంలోని శ్రీ క్షేత్ర ఆలయంలోకి ఓ వేడుకకు ప్రవేశించే సమయంలో ఈ గొడవ జరిగింది.

బీజేపీ మధ్యప్రదేశ్ చీఫ్ సమక్షంలోనే బీజేవైఎం చీఫ్ ను చితకబాదిన సొంత పార్టీ నాయకుడి మద్దతుదారులు.. ఎందుకంటే ?

భారీగా తరలివచ్చిన భక్తులను నియంత్రించేందుకు స్వల్ప లాఠీచార్జి చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఆలయంలోకి 75 మందిని మాత్రమే అనుమతించాలని నిబంధనలు ఉండగా, 400 మందిని బలవంతంగా ఆలయంలోకి ప్రవేశించారు. అయితే లాఠీచార్జి ఆరోపణలను ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఖండించారు. వార్కారీ కమ్యూనిటీపై ఎలాంటి లాఠీచార్జి జరగలేదని ఫడ్నవీస్ నాగ్ పూర్ లో మీడియాతో తెలిపారు.

Scroll to load tweet…

‘‘గత ఏడాది ఇదే ప్రదేశంలో (అలండీ) జరిగిన తొక్కిసలాట లాంటి పరిస్థితి నుంచి పాఠాలు నేర్చుకున్నాం. అందుకే వివిధ గ్రూపులకు తక్కువ ఎంట్రీ పాస్ లు ఇవ్వాలని నిర్ణయించాం. అందులో భాగంగా తీర్థయాత్రలో పాల్గొనే ప్రతీ బృందానికి 75 పాసులు జారీ చేస్తున్నాం.’’ అని ఫడ్నవీస్ మీడియాకు తెలిపారు. అయితే దాదాపు 500 మంది యాత్రలో పాల్గొంటామని పట్టుబట్టారని అందుకే ఇలాంటి పరిణామం చోటు చేసుకుందని అన్నారు. వారు బారికేడ్లను బద్దలు కొట్టారని, పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారని, ఈ సమయంలో కొందరు పోలీసులు గాయపడ్డారని ఫడ్నవీస్ తెలిపారు. 

కాగా.. ఈ పరిణామం ప్రభుత్వంపై ప్రతిపక్షాల దాడికి దారితీసింది. ‘‘అయ్యో.. హిందుత్వ ప్రభుత్వ కక్షసాధింపులను బహిర్గతం అయ్యింది. మాస్క్ కింద పడిపోయింది. ఔరంగజేబు భిన్నంగా ఎలా ప్రవర్తించాడు? మహారాష్ట్రలో మొఘలులు పునర్జన్మ పొందారు’’ అని శివసేన (యూబీటీ) సీనియర్ ఎంపీ సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు.

Scroll to load tweet…

‘‘శ్రీక్షేత్ర అలండిలో వార్కారీ సోదరులపై పోలీసులు లాఠీచార్జి చేసిన తీరు చాలా దారుణం. వార్కారీ వర్గానికి పునాది వేసిన మహానుభావుడు జ్ఞానేశ్వర్ మహారాజ్ సమక్షంలో వార్కారీలకు జరిగిన ఈ అవమానం అత్యంత ఖండించదగినది. వార్కారీ వర్గం పట్ల ప్రభుత్వానికి ఏమైనా బాధ్యత ఉందా లేదా?’’ అని ఎన్సీపీ నేత చగ్గన్ భుజ్బల్ ట్వీట్ చేశారు.

కాగా.. వార్కారీలు ప్రతీ ఏటా అలండి నుండి పండరీపూర్ లోని విఠల్ ఆలయానికి వెళ్ళే పాదయాత్రగా వెళ్తారు. అందులో భాగంగానే జూన్ 11వ తేదీన వారి నడక ప్రారంభమైంది. జూన్ 10 న అలండి నుండి సంత్ జ్ఞానేశ్వర్ మహారాజ్ పాల్ఖీ, డెహూ నుండి సంత్ తుకారాం మహారాజ్ పాల్ఖీ నిష్క్రమణ గుర్తు చేసుకుంటూ ఈ యాత్ర ప్రారంభమవుతుంది. జూన్ 29న ఆషాఢ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పవిత్ర పట్టణమైన పండరీపూర్ లో వార్కారీలు సమావేశమవుతారు.