బిపార్జోయ్ తుఫాను వల్ల ముంబై ఎయిర్ పోర్టులో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని విమానాలు ఆలస్యమవగా.. మరి కొన్ని విమానాలు పూర్తిగా రద్దు అయ్యాయి. దీనిపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అరేబియా సముద్రంలో బిపార్జోయ్ తుపాను బీభత్సం సృష్టించడంతో ముంబైలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తీవ్ర తుపానుగా మారిన బిపర్జోయ్ తుపాను తీవ్రత పెరగడంతో ముంబైలో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీస్తున్నాయి. వందలాది మంది ప్రయాణికులు తమ విమానాల కోసం గంటల తరబడి నిరీక్షించడంతో ముంబై విమానాశ్రయంలో ఆందోళన, గందరగోళం నెలకొంది. వాతావరణ పరిస్థితుల కారణంగా పలు విమానాలు రద్దవడంతో పాటు ఆలస్యమయ్యాయి. కొన్ని విమానాల ల్యాండింగ్ ను నిలిపివేయాల్సి వచ్చింది.
విషాదం.. 11 ఏళ్ల మూగ బాలుడిని కరిచి చంపిన వీధి కుక్కలు.. ఎక్కడంటే ?
కాగా.. ఈ అసౌకర్యంపై కొందరు ప్రయాణికులు ట్విటర్ వేదికగా ఫిర్యాదు చేశారు. వాతావరణం అనుకూలించకపోవడం, రన్ వేను తాత్కాలికంగా మూసివేయడంతో ముంబై నుంచి నడిచే కొన్ని విమానాలు ఆలస్యమవుతాయని ఎయిరిండియా ఓ ప్రకటనలో తెలిపింది. ‘‘ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ముంబై విమానాశ్రయంలో రన్ వే 09/27ను తాత్కాలికంగా మూసివేయడం వల్ల కొన్ని కొన్ని విమానాలు ఆలస్యం అవుతాయి. మరి కొన్ని విమనాలు రద్దు అయ్యాయి. మా అతిథులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము. అంతరాయాలను తగ్గించడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము’’ అని ఎయిరిండియా ట్వీట్ చేసింది.
‘‘విమానాల ఆలస్యం వంటి వేదన మాకు కూడా అంతే ఇబ్బందికరంగా ఉంటుంది. అత్యంత అనియంత్రిత పరిస్థితుల్లో మాత్రమే షెడ్యూల్ లో మార్పులు చేయాల్సి వస్తోంది. మీ మంచి అవగాహన కోసం ఎదురుచూస్తున్నాం’’ అని ఇండిగో ఓ ప్రయాణికుడిపై స్పందించింది.
కోస్తా మహారాష్ట్రలోని కొన్ని జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. రాగల 3-4 గంటల్లో రత్నగిరి, రాయగఢ్, థానే, పాల్ఘర్, కొల్హాపూర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
మేరీల్యాండ్ లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, మరో ముగ్గురికి గాయాలు
బిపర్జోయ్ తుఫాన్ గురువారం గుజరాత్, పాకిస్తాన్ తీరాలను తాకనుంది. కచ్, జామ్నగర్, మోర్బి, గిర్ సోమనాథ్, పోర్బందర్, దేవభూమి ద్వారకా జిల్లాల్లో జూన్ 13-15 తేదీల్లో భారీ వర్షాలు, వేగంగా ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఈదురుగాలుల వేగంతో గాలులు వీస్తాయని, ఇది గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గుజరాత్, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, లక్షద్వీప్ తీరాల్లో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని ఐఎండీ సూచించింది.
